నేటి నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పం టూర్

టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ఆయన బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.తరువాత విమానాశ్రయం నుంచి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నివాసానికి ఆయన బయలు దేరారు.

సాయంత్రం 5 గంటలకు కుప్పం చేరుకోనున్న చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

సుకుమార్ సినిమాలో రామ్ చరణ్ అలా కనిపించబోతున్నాడా..?