పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే..: మంత్రి జోగి రమేశ్

పల్నాడులో చోటు చేసుకున్న అల్లర్లకు కారణం టీడీపీ అధినేత చంద్రబాబేనని మంత్రి జోగి రమేశ్( Jogi Ramesh ) అన్నారు.

కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.ఎస్పీలు, కలెక్టర్లను మార్పించారన్న ఆయన చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని పేర్కొన్నారు.

టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయన్నారు.అలాగే రాష్ట్రంలో టీడీపీ( TDP ) అడ్రస్ గల్లంతు కాబోతోందని చెప్పారు.

కూటమి అధినేత పారిపోయాడన్న జోగి రమేశ్ దత్త పుత్రుడు ఎక్కడికి వెళ్లారో తెలియదని విమర్శించారు.

చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు చేసినా ప్రజాస్వామ్యంలో వైసీపీ గెలుపు ఖాయమని తెలిపారు.ఈ క్రమంలోనే జూన్ 4 తరువాత కూటమిని ప్రజలు సమాధి చేయబోతున్నారని వెల్లడించారు.

స్టార్ హీరోని చేసిన దర్శకుడినే అవమానించిన చిరంజీవి..??