బాబు రివెంజ్ పాలిటిక్స్ ? జగన్ కు ఇబ్బందే ?

నిండు సభలో తనకు జరిగిన అవమానం పై  టిడిపి అధినేత చంద్రబాబు పగ తో రగిలిపోతున్నారు.

  వైసిపి ప్రభుత్వం పైన జగన్ పైన తనకు జరిగిన అవమానం పై కక్ష తీర్చుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు.

అంతే కాదు తన అవమానాన్ని ప్రజలకు జరిగిన అవమానంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే తన అవమానాన్ని పదే పదే  గుర్తుచేసుకుంటూ ఇంటికే పరిమితం కాకుండా జనాల్లోకి వచ్చేసారు.

వరద బాధితుల పరామర్శ పేరుతో జగన్ కు గట్టి పట్టు ఉన్న రాయలసీమ ప్రాంతంలో బాబు పర్యటనలు చేస్తున్నారు.

జగన్ ఒక వృద్ధుడిని అందుకే జనాల్లోకి రాలేకపోతున్నాడని చెబుతూనే,  తాను తన వయసును కూడా లెక్కచేయకుండా జనాల కోసం తిరుగుతున్నానని సంకేతాలను బాబు ఇస్తున్నారు.

కడప లో పర్యటించిన బాబు నేడు  చిత్తూరు ,నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచడమే ఏకైక లక్ష్యంగా బాబు ముందుకు కదులుతున్నాడు.

తనకు జరిగిన అవమానానికి పార్టీ కేడర్ లోనూ పట్టుదల పెరిగిందని, జనాలలోను సానుభూతి కనిపిస్తుంది అని బాబు నమ్ముతున్నాడు.

అందుకే జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై జనాల్లోకి వెళ్లి టిడిపి గ్రాఫ్ పెంచుకోవడంతో పాటు,  జగన్ పై వ్యతిరేకత పెరిగేలా చేయాలని బాబు డిసైడ్ అయిపోయారు.

దీనిలో భాగంగానే భారీ బహిరంగ సభ లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.మూడు రాజధానులు బిల్లు వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు.

"""/"/ ఇప్పటి వరకు అమరావతి, కర్నూల్, విశాఖ ఈ మూడు ప్రాంతాలను రాజధానిగా ప్రకటించినా, అభివృద్ధి ఏమాత్రం చేపట్టలేదనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు బాబు సిద్ధమవుతున్నారు.

విశాఖ, అనంతపురం, తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనాలు వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగేలా చేయాలనే వ్యూహంలో బాబు ఉన్నారట.

ఈ భారీ బహిరంగ సభలకు భారీగా జన సమీకరణ చేపట్టి టీడీపీ సత్తా ఏంటో నిరూపించాలని చూస్తున్నారట.

అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో అభివృద్ధి ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయింది .

టీడీపీ నేతలు ఎంతమంది అనేక అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు ఇలా అనేక విషయాలపై భారీ బహిరంగ సభల్లో ప్రస్తావించేందుకు బాబు సిద్దమవుతున్నారట.

విశాఖ స్టీల్‎ప్లాంట్ భూములపై ఏపీ హైకోర్టులో విచారణ