జైల్లో చంద్రబాబు.. పార్టీలో కీలకంగా మారిన బాలయ్య

హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలను అంతగా పట్టించుకోనట్లు గానే వ్యవహరిస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు సందర్భం రావడం తో  తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారారు.చంద్రబాబుకు స్వయానా బావమరిది, వియ్యంకుడు అయిన బాలకృష్ణ చంద్రబాబు( Chandrababu Naidu ) అరెస్ట్ నేపథ్యంలో పార్టీలో కీలకంగా మారాలని నిర్ణయించుకున్నారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయ్యి,  రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం, త్వరలోనే లోకేష్ తో పాటు టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ తరఫున ఏ విధంగా పోరాటం చేయాలి ?  ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే విషయంపై పార్టీ సీనియర్ నేతలతో బాలకృష్ణ నిన్న సమావేశం అయ్యారు.

"""/" / ఈ సమావేశంలో బాలకృష్ణతో పాటు పార్టీ సీనియర్ నేతలు అయిన యనమాల రామకృష్ణుడు , కంభంపాటి రామ్మోహన్,  ఆలపాటి రాజా,  అనురాధ,  గొట్టిపాటి రవికుమార్ , ఏలూరు సాంబశివరావు అనగాని సత్యప్రసాద్,  పట్టాభిరామ్ తో పాటు,  మరికొంతమంది నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత తలెత్తిన పరిస్థితులు,  రాబోయే రోజులు వైసిపి ప్రభుత్వం అనుసరించాల్సిన  విధానాలపైన ప్రధానంగా చర్చించారు .

ముందు ముందు ఏ విధంగా పార్టీని జనాలలోకి తీసుకువెళ్లాలి ?  చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ప్రజల్లో ఏ విధంగా సానుభూతి పొందాలనే విషయం పైన ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా పార్టీ తరఫున అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు తాము సిద్ధంగా ఉన్నానని బాలకృష్ణ చెప్పారట .

తాను చేయాల్సిన కార్యక్రమాల గురించి బ్లూ ప్రింట్ ఇవ్వాలని పార్టీ సీనియర్ నేతలను కోరారట.

"""/" /  పార్టీలోని సీనియర్ల సూచనల మేరకు వారు చెప్పిన విధంగా రాబోయే రోజుల్లో టిడిపిని ( TDP )జనాల్లోకి తీసుకు వెళ్లే విధంగా తాను ప్రయత్నిస్తానని బాలయ్య చెప్పారట.

చంద్రబాబు అరెస్ట్ కావడం, లోకేష్( Nara Lokesh ) తో పాటు మరికొంతమంది పార్టీకి నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో,  పార్టీలో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే  బాలయ్య అలర్ట్ అవుతూ, చంద్రబాబు లోకేష్ లకు ప్రత్యామ్నాయంగా తాను ఉన్నాను అనే భరోసా పార్టీ నేతల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తుండడంతో ,  రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో బాలయ్య కీలకంగా అవుతారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇస్లాం అరబ్బుల మతం, భారత్‌లో అందరూ హిందువులే.. ఐఏఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు!