వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు హాట్ కామెంట్స్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఏపీలో ఓ వ్యక్తి అరాచక శక్తిగా తయారయ్యారన్నారు.

పోలీస్ వ్యవస్థను సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.తనపై ప్రయోగించడానికే జీవో నెంబర్ -1 తీసుకొచ్చారని పేర్కొన్నారు.

నిన్న కుప్పంలో తనపై దాడి చేసి చివరకు తిరిగి తమపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు.

అంతేకాకుండా కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.తన సొంత నియోజకవర్గంలో తనను పర్యటించనివ్వడం లేదని మండిపడ్డారు.

ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితిని తీసుకొచ్చారన్న చంద్రబాబు రాష్ట్రాన్ని టెర్రరిస్ట్ స్టేట్ గా తయారు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

How Modern Technology Shapes The IGaming Experience