'జమిలి' పై బాబు ఆశలు పెట్టుకున్నారా ?
TeluguStop.com
తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్ర బాబు ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్ అయ్యారు.
వయస్సు రీత్యా, ఆరోగ్య కారణాల దృష్ట్యా బాబు ఇక విశ్రాంతికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని అంతా భావించారు.
ఇక పార్టీ పగ్గాలు కూడా తన రాజకీయ వారసుడు లోకేష్ కి అప్పగిస్తారని బాబు భావించారు.
అయితే ఇలా ఊహించుకున్న వారందరి ఊహలు పటా పంచెలు చేస్తూ బాబు ప్రస్తుతం బాగా యాక్టివ్ అయిపోయారు.
ఏపీలో ప్రజా పోరాటాలు తలకెత్తుకుని నిస్తేజం లో ఉన్న టీడీపీ నాయకుల్లో నూతన ఉత్సాహం రగిల్చారు.
ఇక్కడితో బాబు సరిపెట్టుకోవడంలేదు.పూర్తిగా ఉనికే కోల్పోయిన తెలంగాణ టీడీపీలోనూ అదే రకమైన ఉత్సాహం రేకెత్తించేందుకు బాబు ముందుకు కదిలాడు.
అయితే బాబు ఇప్పటికిప్పుడు ఈ విధంగా దూకుడు ప్రదర్శించడం వెనుక కారణాలు కూడా చాలానే ఉన్నట్టు అర్ధం అవుతోంది.
"""/"/
తాజాగా హైదరాబాద్ విచ్చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో శనివారం భేటీ అయ్యారు.
తాజా రాజకీయాలు, తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడం వంటి విషయాలపై లోతుగా చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది స్వార్ధ నాయకులు మాత్రమే టీడీపీని వీడారంటూ చెప్పుకొచ్చారు.
టీడీపీ లో ఒక్క నాయకుడు వేల్లోపోతే వంద మందిని తయారు చేసుకునే శక్తి, సామర్ధ్యం తమ పార్టీకి ఉందని బాబు వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం కార్యకర్తలను అణగదొక్కాలని చూసినా ఎదురొడ్డి నిలిచారని గుర్తుచేశారు.ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వంటి విశ్వసనీయమైన నాయకులు మనకు కావాలని చంద్రబాబు అన్నారు.
ఆయన్ను ఎంతగా ప్రలోభపెట్టినా టీడీపీని వీడకుండా ఉన్నారంటూ ఆయన్ను ప్రశంసించారు.తాను ఎప్పుడూ తెలంగాణ నేతలకు అండగా ఉంటానని,నియోజకవర్గాల కమిటీల ని గ్రామ స్థాయి కమిటీలు కూడా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ సహకరించాలని బాబు పిలుపునిచ్చారు.
"""/"/
బాబు ఈ రకంగా స్పీడ్ పెంచడం వెనుక 'జమిలి' ఎన్నికలే కారణంగా కనిపిస్తోంది.
లోక్‌సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో దీనిపై ఇప్పటికే సాధ్యాసాధ్యాలపై జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైంది.
చట్టపరంగా కొన్ని మార్పులు చేయడంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకుంటే లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు సులభమేనని ఎన్నికల కమిషన్ వర్గాలు కూడా చెబుతున్న నేపథ్యంలో బాబు లో కొత్త ఆశలు చిగురించినట్టుగా తెలుస్తోంది.
కేంద్రం తాను అనుకున్నట్టుగా పరిస్థితులన్నీ అనుకూలిస్తే 2022 చివర్లో కానీ లేదా 2013 స్టార్టింగ్‌లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది.
ఈ విషయంపై బాబు కు ముందే సమాచారం ఉండడంతో టీడీపీని రెండు రాష్ట్రాల్లో బాగా యాక్టివ్ చేస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.
రైతుబిడ్డ కాదు రాయల్ బిడ్డ.. పల్లవి ప్రశాంత్ మాటలకు చేతలకు పొంతన లేదుగా!