చంద్రబాబు హామీ : వంగవీటి రాధా దశ తిరగబోతోందా ?

రాజకీయంగా ఎప్పటి నుంచో అనేక వడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చిన వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు( Vangaveeti Radhakrishna ) ఇప్పుడు కాలం కలిసి రాబోతోంది.

  కూటమి ప్రభుత్వంలో ఆయనకు కీలక పదవి లభించే అవకాశం కనిపిస్తోంది .

వాస్తవంగా మొన్నటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా రాధాకృష్ణ పోటీ చేసేందుకు ప్రయత్నించారు.  అయితే సీట్ల సర్దుబాటులో రాధాకృష్ణ కు టికెట్ అవకాశం దక్కలేదు.

అయితే అప్పట్లోనే రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ చంద్రబాబు ఇచ్చారు .ఇప్పుడు రాజ్యసభ సభ్యుల ఎంపిక పూర్తయిన నేపథ్యంలో,  రాధా కు ఆ అవకాశం దక్కకపోవడంతో , ఎమ్మెల్సీ ఇచ్చేందుకు చంద్రబాబు( Chandrababu ) హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈ మేరకు రాధాకృష్ణను పిలిపించి చంద్రబాబు మాట్లాడారు. """/" / చంద్రబాబు , రాధాకృష్ణ భేటీ పై రాజకీయ వర్గాలను ఆసక్తి నెలకొంది.

రాధా రాజకీయ భవిష్యత్తు , చంద్రబాబు హామీ నేపథ్యంలోఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

2025 మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో రాధాకృష్ణకు అవకాశం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారట.

అలాగే ఎమ్మెల్సీ తో పాటు రాజకీయంగా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారట .

ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటు,  రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రాధకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

  """/" / దీనికి కారణం కాపు సామాజిక వర్గంలో రాధాకు ఫాలోయింగ్ ఉండడంతో,  ఆ ఇమేజ్ ను పార్టీకి ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట .

వంగవీటి రంగా( Vangaveeti Ranga ) కుమారుడిగా రాధాకృష్ణకు కాపు సామాజిక వర్గం లో మంచిపట్టు ఉంది .

ఈ వర్గంలో టిడిపి బలం మరింత పెంచుకునేందుకు రాధాకు మంత్రి పదవి ఇస్తే తమకు మరింత కలిసి వస్తుందని భావిస్తున్నారట.

రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాధకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారట.

చంద్రబాబు తాజా నిర్ణయంతో రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి డోకా లేదన్న విషయం అర్థమవుతుంది.

ఈ పరిణామాలు వంగవీటి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

కరెన్సీ నోట్ల కట్టలను మంటల్లో పడేసిన యూఎస్ వ్యక్తి.. వీడియో వైరల్..