Devineni Uma : సీటు దక్కని దేవినేని ఉమాకి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు..!!
TeluguStop.com
2024 ఎన్నికలకు సంబంధించి పొత్తులో భాగంగా కొంతమంది సీనియర్ తెలుగుదేశం నేతలకు టికెట్లు రాలేదు.
ఈ రకంగా టికెట్ రాని వారిలో మైలవరం మాజీ ఎమ్మెల్యే మాజీమంత్రి దేవినేని ఉమా( Devineni Uma ) ఒకరు.
2024 ఎన్నికలకు సంబంధించి మైలవరం టీడీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్( MLA Vasantha Krishna Prasad ) కి అప్పగించారు.
దీంతో దేవినేని ఉమా సీటు దక్కలేదని నిరాశలో ఉన్నారు.ఈ క్రమంలో అధినేత చంద్రబాబు ఉమాకు ఉరటా కలిగించే విధంగా కీలక బాధ్యతలు అప్పగించారు.
విషయంలోకి వెళ్తే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలను అప్పగించడం జరిగింది. """/" /
దేవినేని ఉమా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ఇప్పుడు ఈ హోదాతో పాటు అదనపు బాధ్యతలను దేవినేని ఉమాకు చంద్రబాబు( Chandrababu ) అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఉమా రాణించడం జరిగింది.
2014లో మైలవరం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చంద్రబాబు క్యాబినెట్ లో ఇరిగేషన్ మంత్రిగా రాణించారు.
2019 ఎన్నికలలో ఓటమిపాలయ్యారు.అయినా గాని మైలవరం నియోజకవర్గం( Mylavaram Constituency ) లో ప్రతిపక్ష పార్టీ నేతగా కీలక పాత్ర పోషించారు.
దీంతో కచ్చితంగా ఈసారి ఎన్నికలలో పోటీ చేసి గెలవాలని తాపత్రయపడ్డారు.కానీ చివరి నిమిషంలో టికెట్ దక్కలేదు.
దీంతో మనస్థాపం చెందిన దేవినేని ఉమాకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలను అప్పగించి చంద్రబాబు బుజ్జగించారు.
రచ్చ గెలిచి ఇంట గెలవలేదుగా.. ఎన్టీఆర్, బన్నీలకు ఒకే సమస్య ఎదురైందా?