శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు .. ఏలూరు జిల్లాకు పవన్
TeluguStop.com
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది ఏపీలోని టిడిపి కూటమి ప్రభుత్వం.
ఈ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్ల (Free Gas Cylinders)పథకానికి నేడు శ్రీకారం చుడుతున్నారు.
ఈ మేరకు టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) ఈరోజు శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో పర్యటించనున్నారు.
ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు.
ఏపీ ముఖ్యమంత్రి హోదాలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా చంద్రబాబు శ్రీకాకుళానికి వస్తున్నారు.
దీంతో భారీగానే జిల్లా నాయకులు ఏర్పాట్లు చేపట్టారు. ఈదుపురం లో ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు నేరుగా చంద్రబాబు ఇవ్వనున్నారు.
ఈదుపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని. """/" /
ప్రసంగించనున్నారు.
ఇక చంద్రబాబు సభను దృష్టిలో పెట్టుకుని 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు.
ఇక ఈ బహిరంగ సభలో అనేక అంశాల పైన , ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలపైన చంద్రబాబు(Chandrababu) ప్రసంగించనున్నారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీ జన సమీకరణ పైన కూటమి నాయకులు దృష్టి సారించారు.
"""/" /
పవన్ కళ్యాణ్(pavan Kalyan) పర్యటన జనసేన(Janasena) అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఏలూరు జిల్లాలో (Eluru District)పర్యటిస్తారు.
ఈరోజు ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో 10 గంటలకు రాజమండ్రి కి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు.
అనంతరం రాజమండ్రి(Later Rajahmundry) నుంచి ద్వారకాతిరుమల కు రోడ్డు మార్గాన పవన్ రానున్నారు.
ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్స్ ను లబ్ధిదారులకు పవన్ కళ్యాణ్ అందజేయనున్నారు.
ఆ తరువాత జగన్నాధపురం లో కొండపైన లక్ష్మి నరసింహస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారు.
పవన్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు.
విమానంలాంటి అద్భుతమైన కారును కొనుగోలు చేసిన విజయ్.. ఈ కారు ప్రత్యేకతలివే!