నందమూరి తారకరత్న మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు..!!

సినీ హీరో నందమూరి తారకరత్న తుది శ్వాస విడిచారు.బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో గత 23 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం రాత్రి మృతి చెందడం జరిగింది.

తారకరత్న మృతి పట్ల నందమూరి అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో తారకరత్న మృతి పట్ల చంద్రబాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

"నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది.తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు.

"""/" / 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న.చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు.

తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.".

అని చంద్రబాబు తెలియజేయడం జరిగింది.తారకరత్ననీ బతికించుకోవడానికి చంద్రబాబు అనేక రకాలుగా కృషి చేశారు.

బెంగళూరులో చికిత్స నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులను సంప్రదించటం జరిగింది.

ఇక బాలకృష్ణ అయితే తారకరత్నకీ  హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్న రోజులలో అన్ని తానై ఉండి దగ్గరుండి చూసుకున్నారు.

అయినా గాని ఆయన మరణించడం అందరికీ విషాదాన్ని నింపింది.

రైల్వే స్టేషన్‌లో స్టంట్ చేస్తూ ఒక కాలు, ఒక చేయి పోగొట్టుకున్న యువకుడు..