పార్టీ నేత‌లను చంద్ర‌బాబు నమ్మ‌ట్లేదా.. అంత ఆవేద‌న ఎందుకు...?

ఇప్ప‌డు ఏపీలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది అంటే ఇత‌ర పార్టీల‌తో పోటీ ప‌డ‌కం కంటూ కూడా సొంత పార్టీలోనే కు్మ‌ములాట‌లు ఎక్కువై వారిలో వారే ఆధిప‌త్యం కోసం పోరాడుతున్నట్టు క‌నిపిస్తోంది.

ఇక పార్టీలో కూడా గ్రూపులు త‌యారు కావ‌డంతో అస‌లు పార్టీలో ఎవ‌రిని న‌మ్మాలో కూడా చంద్రబాబునాయుడుకి తెలియ‌ట్లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఈ మాలు వినటానికే షాకింగ్ గా ఉన్నా కూడా ప్ర‌స్తుతం టీడీపీలో ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది.

ఇక ప్ర‌తి ఒక్క‌రూ కూడా పార్టీని వీడుతామ‌ని చంద్ర‌బాబును బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారంట‌.

అంతెందుకు మొన్న‌టికి మొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్ర‌బాబుకు ఎంత త‌ల‌నొప్పి తీసుకువ‌చ్చారో తెలుస్తూనే ఉంది.

రాజీనామపై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని ఇక చంద్ర‌బాబు అలాగే లోకేష్ మీద ఓ రేంజ్‌లో వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని కూడా చూస్తూనే ఉన్నాం.

ఇక ఆయ‌న్ను బుజ్జ‌గించేందుకు చంద్ర‌బాబు కూడా నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఇక చంద్రబాబుతో భేటీ త‌ర్వాత బుచ్చ‌య్య త‌న వైఖ‌రి మార్చుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాన‌ని చెప్పారు.

ఇక ఈ స‌ద‌ర్భంగా బుచ్చ‌య్య కూడా బాగానే డిమాండ్లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. """/"/ ఈయ‌న‌తో పాటు మ‌రి కొంద‌రు కూడా ఇలాగే చంద్ర‌బాబుకు కొత్త త‌ల‌నొప్పులు తీసుకువ‌స్తుండ‌టంతో పార్టీలో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాకుండా ఉందంటూ చంద్రబాబు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఎందుకంటే వ‌రుస‌గా ఒక్కొక్క‌రు ఇలా త‌న‌కు షాక్ ఇస్తుండ‌టంతో ఎవ‌రు ఏ ఉద్ధేశంతో మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా ఉందంట‌.

పార్టీలో కోవ‌ర్టులు కూడా ఉన్నార‌ని అయితే వారెవ‌రో గుర్తించ‌డం క‌ష్టంగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక భ‌విష్య‌త్ లో కూడా పార్టీ ప‌రిస్థితి ఇలాగే ఉంటే గెలుస్తామ‌న్న ధీమా కూడా ఉండ‌దంటూ ఆయ‌న స‌న్నిహితులు సూచిస్తున్నారంట‌.

మ‌రి చంద్ర‌బాబు పార్టీని ఎలా లైన్‌లో పెడ‌తారో చూడాలి.

ఏపీలో పెన్షన్ కష్టాలు.. చంద్రబాబుకు బుద్ధి చెబుతామంటున్న ప్రజలు