పొత్తు లేకుండా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదు..: మంత్రి దాడిశెట్టి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాకినాడ జిల్లా తునిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

అమరావతి పేరుతో చంద్రబాబు రూ.వేల కోట్లు దోచుకున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు.

చంద్రబాబు అధికారంలోకి రావొద్దని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి రావడం జరగదని తేల్చి చెప్పారు.

అంతేకాకుండా ఎటువంటి పొత్తు లేకుండా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని తెలిపారు.

రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హత్య సినిమా రివ్యూ అండ్ రేటింగ్!