వైసీపీ అనుకూలంగా వస్తున్న సర్వేలపై టెన్షన్ వద్దు అంటున్న బాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల కోడ్ నేపధ్యంలో ఇన్ని రోజులు క్యాబినెట్ మీటింగ్ పెట్టల్లెకపోయారు.

అయితే ఎన్నికల కమిషన్ షరతులతో కూడిన పర్మిషన్ ఇవ్వడంతో క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి మంత్రులతో చర్చించారు.

అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వ కార్యక్రమాల గురించి కాకుండా ఎక్కువగా టీడీపీ ఎన్నికల ఫలితాలపై సమీక్షగానే జరిగినట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ మీటింగ్ లో మంత్రులని, ఫలితాలు సరళి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ మీటింగ్ లో మంత్రులు అందరూ వైసీపీకి అనుకూలంగా వస్తున్న ఎగ్జిట్ పోల్స్ గురించి చర్చించినట్లు తెలుస్తుంది.

టీడీపీకి వ్యతిరేకంగా సర్వేలు రావడం చూస్తూ ఉంటే స్థానికంగా పార్టీ శ్రేణులు కాస్త గందరగోళానికి గురవుతున్నట్లు మంత్రులు చెప్పినట్లు సమాచారం.

అయితే సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్న ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదని కచ్చితంగా మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందని, భారీ మెజారిటీతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు మంత్రులకి ధైర్యం చెప్పినట్లు తెల్లుస్తుంది.

గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌ చనిపోయినట్లుగా ప్రచారం.. అవాస్తవమన్న అమెరికా పోలీసులు