పవన్ సిగ్నల్స్ పై టీడీపీ సైలెన్స్ ? కారణం ఇదా ?
TeluguStop.com
టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నాము అనే సంకేతాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో క్లారిటీ ఇచ్చారు.
క్లారిటీగా తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించక పోయినప్పటికీ, వైసిపి వ్యతిరేక పార్టీలు అన్నింటితో కలిసి పొత్తు పెట్టుకుంటామని వైసీపీని అధికారానికి దూరం చేస్తామని పవన్ ప్రకటించారు.
దీంతో అందరికీ టిడిపి , బిజెపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే విషయం అర్థమైంది.
ఈ మూడు పార్టీల కాంబినేషన్ లో తప్పకుండా సక్సెస్ సాధ్యమవుతుందని, వైసిపి అధికారానికి దూరం అవుతుందని, 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని అంతా ఒక అంచనాకు వచ్చేశారు.
అప్పుడే దీనికి సంబంధించిన రాజకీయ సమీకరణాలు మొదలవగా, జనసేన లోనూ ఉత్సాహం కనిపిస్తోంది .
ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో జనసేన తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న టిడిపి మాత్రం ఈ వ్యవహారంపై స్పందించలేదు.
ఆ పార్టీ నాయకులు ఎవరు దీనిపై మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.దీనికి కారణం చంద్రబాబు అభిప్రాయం ఏమిటి అనేది ఇంకా క్లారిటీ రాకపోవడమే.
జనసేన ఆవిర్భావ సభలో పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన వైసీపీ ప్రత్యర్థి పార్టీలను ఏకం చేసి కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమైంది.
అంతే కాదు బిజేపి రోడ్ మ్యాప్ ప్రకారమే తాము నడుచుకుంటామని ప్రకటించడం టిడిపికి నిరాశ కలిగించింది.
"""/"/
ఎందుకంటే టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు బిజెపి ఇప్పటికీ ఇష్టపడటం లేదు.బిజెపి అగ్ర నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అంత టిడిపితో పొత్తును వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే దీనిపై సరైన క్లారిటీ తెచ్చుకున్న తరువాత మాత్రమే స్పందించాలని, ముఖ్యంగా బిజెపి అగ్రనేతలు అభిప్రాయం తేలిన తర్వాత ఈ పొత్తుల అంశంపై స్పందిస్తే మంచిదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.
అందుకే పవన్ పొత్తుల అంశాన్ని ప్రకటించినా, ఇప్పటి వరకు టిడిపి సైలెంట్ గానే ఉంది.
మరి కొంత కాలం వేచి చూసే ధోరణిని అవలంబించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట.
లండన్ అక్షయపాత్ర కిచెన్‌లో సెలబ్రెటీ చెఫ్ సంజీవ్ కపూర్ సందడి