పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబే: సీఎం జగన్
TeluguStop.com
ఏపీ అసెంబ్లీలో పోలవరం ముంపు బాధితుల పరిహారంపై సీఎం జగన్ వివరణ ఇచ్చారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గతంలో రూ.6.
84 లక్షలు ఇచ్చారని తెలిపారు.అధికారంలోకి వస్తే రూ.
10 లక్షలు ఇస్తామని చెప్పామన్నారు.చెప్పినట్లే జీవోను కూడా విడుదల చేశామని పేర్కొన్నారు.
14,110 మంది నిర్వాసితులకు రూ.19,060 కోట్లతో పునరావాసం కల్పించడంతో పాటు.
మూడేళ్లలో 10,330 మంది నిర్వాసితులకు రూ.1722 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
పునరావసం పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.అనంతరం పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబేనని సీఎం జగన్ విమర్శించారు.
ఆయన అర్ధరాత్రి ప్యాకేజ్ కు ఒప్పుకున్నారని ఆరోపించారు.టీడీపీ తప్పుల వలనే పోలవరం పనులు ఆలస్యం అయ్యాయని మండిపడ్డారు.
వారి నిర్వాకం కారణంగా రూ.2900 కోట్లు బ్లాక్ అయ్యాయన్నారు.
యుద్ధ ప్రాతిపదికన పోలవరం పనులు పూర్తి చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు.
చిరంజీవి విశ్వంభర సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ కొడుతాడా..?