ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు
TeluguStop.com
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు గుప్పించారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు.జల్ జీవన్ మిషన్ అమలులో ఏపీ 18వ స్థానంలో ఉందని విమర్శించారు.
జగన్ ప్రభుత్వం ఎన్నో వైఫల్యాలకు తాగునీటి సమస్య మరో ఉదాహరణ అని తెలిపారు.
ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని అసమర్థుడు సీఎం జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా : వర్జీనియా చట్టసభకు ఇద్దరు భారత సంతతి నేతల ఎన్నిక!