టీడీపీని చంద్రబాబు కబ్జా చేశారు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
టీడీపీని చంద్రబాబు కబ్జా చేశారని సీఎం జగన్ అన్నారు.శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సొంతంగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే వాళ్లను ఓ ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారన్నారు.
పిల్లను ఇచ్చిన మామకు వెన్నుపొటు పొడిచి అధికారంలోకి వస్తే వాళ్లను చంద్రబాబు అంటారని తెలిపారు.
వెన్నుపాటుదారుడు చంద్రబాబును సమర్థించిన వారిన ఏమనాలి అని ప్రశ్నించారు.మోసాలు చేసే వారికి అధికారం కోసం మరో అవకాశం ఇవ్వొచ్చా అని అడిగారు.
రాజకీయం అంటే ప్రజలకు జవాబుదారీతనమని పేర్కొన్నారు.మోసాలను, అబద్దాలను ప్రజలు నమ్మొద్దని చెప్పారు.
మంచి జరిగిందో లేదో అన్నదే కొలమానంగా పెట్టుకోవాలని సూచించారు.మంచి చేసిన వారికే ఓటు వేయాలని సీఎం జగన్ వెల్లడించారు.
ఈ సిరి ధాన్యం ధర తక్కువ.. ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ..!