Thikka Reddy : బ్రోకర్లు చెప్పిన మాటలను చంద్రబాబు నమ్మారు..: తిక్కారెడ్డి
TeluguStop.com
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి( Thikka Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తారని భావించానన్నారు.కానీ పార్టీ అధిష్టానం తనకు సీటు ఇవ్వలేదని చెప్పారు.
టికెట్ విషయంపై తనను పిలిపించి కనీసం చర్చించలేదని మండిపడ్డారు.ఈ క్రమంలోనే చంద్రబాబు, లోకేశ్ చుట్టూ మొత్తం బ్రోకర్లే ఉన్నారన్న తిక్కారెడ్డి కొంతమంది బ్రోకర్లు చెప్పిన మాటలను చంద్రబాబు( Chandrababu ) నమ్మారని పేర్కొన్నారు.
"""/" /
టీడీపీ టికెట్ ను వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ( Balanagi Reddy )ముందే ప్రకటించారని తెలిపారు.
బాలనాగిరెడ్డి మాట్లాడిన వీడియో కూడా తన దగ్గర ఉందన్నారు.ఈ నేపథ్యంలో టికెట్ విషయంలో చంద్రబాబు, లోకేశ్ పున: పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.