ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్..: మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారని మంత్రి రోజా అన్నారు.

రూ.241 కోట్లు చంద్రబాబు దోచుకున్నారని అందుకే జైలుకి వెళ్లారని తెలిపారు.

అయితే ఇన్ని రోజులు వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేశారన్న మంత్రి రోజా ఇప్పుడు కుదరలేదని చెప్పారు.

అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఛైర్ మీదకి వచ్చి మానిటర్ పగలగొట్టి టీడీపీ సభ్యులు గందరగోళం చేశారని తెలిపారు.

అసెంబ్లీలో రౌడీయిజం చేసి కలరింగ్ ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.ప్రజల డబ్బుని దోచుకున్న ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పద్మశ్రీ అవార్డులపై రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు…మనకు రావు అంటూ?