ఆ వలస నేతలకు నో టికెట్  ! చంద్రబాబు సంచలన కామెంట్స్ 

తెలుగుదేశం పార్టీలో పెను సంచలనం సృష్టించేందుకు టీడీపీ  అధినేత చంద్రబాబు డిసైడ్ అయినట్టు గా కనిపిస్తున్నారు .

అందుకే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విషయంపైన ఆయన పూర్తిగా దృష్టి సారించారు.ఈ మేరకు గతంలో మాదిరిగా మొహమాటం రాజకీయాలు చేయకూడదని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా భారీ ప్రక్షాళన పార్టీలో చేపట్టాలని డిసైడ్ అయిపోయారు.

  ఇటీవల అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీకి, తనకి జనాల్లో సానుభూతి పెరిగిందని,  దీనిని సద్వినియోగం చేసుకుంటూ వైసిపి ఇరుకున పెట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

  అందుకే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలని విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

  ఈ సందర్భంగా వలస నేతల విషయంలో బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు సొంత పార్టీలోనే నేతలకు బాబు వార్నింగ్ ఇచ్చారు.నిన్న జమ్మలమడుగులో కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ లో చేరారు.

మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి , ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి,  తదితరులు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమక్షంలో చేరారు.

  ఈ సందర్భంగా చంద్రబాబు  వలస నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.ఎన్నికలకు ముందు పార్టీల్లోకి వలస వచ్చే నాయకులకు టికెట్ ఇచ్చేది లేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు .

పార్టీ కోసం ఎవరైతే పూర్తిగా కష్టపడతారో వారికి మాత్రమే టికెట్ ఇస్తామని ప్రకటించారు.

ఎన్నికలకు ముందు పార్టీలో చేరదామని భావించిన వారికి అంతగా ప్రాధాన్యం ఇచ్చేది లేదు అంటూ కామెంట్స్ చేశారు.

అయితే బాబు చేసిన కామెంట్స్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరదామని చూస్తున్న నాయకులకు గట్టి షాక్ ఇచ్చాయి.

"""/" / ""వరుసగా పార్టీలు మారుతూ వచ్చే వారికి అస్సలు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం ఇవ్వని,  అటువంటి నేతలను  చేర్చుకునేదే లేదు అంటూ పరోక్షంగా కొంతమంది పై కామెంట్స్ చేశారు.

చంద్రబాబు చేసిన కామెంట్స్ పార్టీల్లో చర్చనీ యాంశంగా మారాయి.  క్రమక్రమంగా టీడీపీ గ్రాఫ్ తగ్గుతూ ఉండటంతో , ఎన్నికలకు ముందు నుంచి టీడీపీలోకి వచ్చేందుకు చాలామంది నేతలు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇప్పుడు అటువంటి నేతలకు బాబు మాటలు మింగుడుపడడం లేదు

ప్యాన్ ఇండియా సినిమా బడ్జెట్ పెరిగితే హీరోల జుట్టు పొడుగు అవ్వాల్సిందేనా ?