35 ఇవ్వండి లేదు 25 ఇస్తాం.. జనసేన, టీడీపీ సీట్ల పంచాయతీ!
TeluguStop.com
టీడీపీ.జనసేన పొత్తుపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే దాదాపుగా పొత్తులు కన్ఫర్మ్ అయినట్లుగానే కనిపిస్తుంది.
ప్రస్తుత సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్, టీడీపీ మధ్య పోటీ చేయాల్సిన నియోజకవర్గాలకు సంబంధించి చర్చలు జరిగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ 35 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంట్ నియోజకవర్గాలు అడగ్గా. చంద్రబాబు మాత్రం వరుసగా 25, 3 స్థానాలు మాత్రమే ఇవ్వగలరని స్పష్టం చేసినట్లు సమాచారం.
డీల్ ఇంకా కుదరలేదు.ఈ నెలాఖరు లోగా సీట్లకు సంబంధించిన చర్చలు కొలిక్కి రావచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
"""/"/
ఈ డిల్‌లో మరో ముఖ్య అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఒకవేళ పవన్ కళ్యాణ్‌కు సరైన అభ్యర్థులు దొరకని పక్షంలో జనసేన తరపున పోటీ చేసేందుకు తానే స్వయంగా అభ్యర్థులను రంగంలోకి దింపుతానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో కలిసి పోటీ చేసే దిశగానే రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
తను అడిగిన మోజార్టి నియోజక వర్గాల్లో సీట్లు ఇచ్చేందకు చంద్రబాబు హామీ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం.
"""/"/
అయితే ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న చర్చలను కాషాయ పార్టీ జాగ్రత్తగా గమనిస్తుంది.
ఆదివారం బాబు.పవన్ మధ్య జరిగిన సమావేశానంతరం, తాను బిజెపి నేతలతో మాట్లాడి ఉమ్మడి ప్రతిపక్షం ఆవశ్యకతను వారికి వివరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పగా, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న “ఎమర్జెన్సీ లాంటి” పరిస్థితిలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ చేతులు కలపాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు.ఈ మాటలను బట్టి చూస్తే వైఎస్‌ఆర్‌సీపీని ఎదుర్కోవడానికి బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి కోసం పవన్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Argentina