ఇద్దరికి నేషనల్ పాలిటిక్సే దెబ్బేశాయా ?

జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు రాణించడం అంతా తేలికైన విషయం కాదు.అందుకేనేమో జాతీయ రాజకీయాలవైపు అడుగులు వేసిన ప్రతిసారి మన తెలుగు రాష్ట్రాల నేతలు ఘోరంగా విఫలం అవుతున్నారు.

2019 ఎన్నికల కంటే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని గట్టిగానే ప్రయత్నించారు.

ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేశారు కూడా.ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలతో చంద్రబాబు( Chandrababu )కు సత్సంబంధాలు ఉండడంతో థర్డ్ ఫ్రంట్ దిశగా కూడా బాబు అడుగులు వేశారు.

కట్ చేస్తే 2019 ఎన్నికల్లో ఏపీలోనే ఘోర ఓటమి చవిచూశారు. """/" / ఆ ఎన్నికల్లో కేవలం 23 సిట్లకే పరిమితం కావడం బహుశా తెలుగదేశం పార్టీ( Telugu Desam Party ) హిస్టరీలోనే చెరిగిపోని మచ్చ.

ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు.

ఇప్పుడు తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ కూడా అదే పరిస్థితి ఎదురుకావడం గమనార్హం.

జాతీయ రాజకీయల్లో చక్రం తిప్పాలని భావించి టి‌ఆర్‌ఎస్ ను బి‌ఆర్‌ఎస్ గా మార్చిన కే‌సి‌ఆర్ ఆర్నెళ్ల ముందు వరకు ఆయా రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ.

నేషనల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతూ వచ్చారు. """/" / ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెడతామని కే‌సి‌ఆర్( KCR ) భావిస్తున్న వేళ అనూహ్యంగా సొంత రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) ఘోర ఓటమిని కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు.

దీన్ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల నేతలకు నేషనల్ పాలిటిక్స్ కలిసిరావడం లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

అయితే చంద్రబాబు కేవలం థర్డ్ ఫ్రంట్ దిశగానే అడుగులు వేయగా.కే‌సి‌ఆర్ మాత్రం ఏకంగా పార్టీ పేరు మార్చి నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

మరి సొంత రాష్ట్రంలో ఎదురైన పరాభవంతో కే‌సి‌ఆర్ కూడా చంద్రబాబు మాదిరి జాతీయ రాజకీయాలను పక్కన పెడతారా ? లేదా రిజల్ట్ తో సంబంధం లేకుండా జాతీయ రాజకీయలపై ఫోకస్ పెడతారా అనేది చూడాలి.

వైరల్ వీడియో: బైక్ పై రీల్స్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే..?