చంద్రబాబు పేరు చెబితేనే ప్రజలు భగ్గుమంటున్నారని అంటున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజుకొక మలుపు తిరుగుతుంది.
తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపి నేత చంద్రబాబు నాయుడు పైన విమర్శనాస్త్రాలు సంధించారు.
అసలు ఇంతకీ వారేమన్నారు ఇప్పుడు చూద్దాం.రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 14 నెలలు అయిందని ఇందులో చంద్రబాబుగారూ మీరు గెలిచిన ఆ 23 చోట్లకూడా మీపేరు చెప్తే ప్రజలు భగ్గుమంటున్నారు.
అలాంటి మీరు అమరావతి పేరుమీద దొంగపోల్స్ పెడుతున్నారు.మీ టీవీలు, మీ పేపర్లు, మీ వెబ్‌సైట్లలో పెట్టే పోల్స్‌లో ఫలితాలు ఎలా వస్తాయో రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు.
రాజకీయంగా చివరిదశలో ఉన్నమీరు ఇప్పటికైనా కళ్లు తెరవండి.ఈ పైశాచిక ఎత్తుగడలు మానేయండి.
కుళ్లు, కుతంత్రాలు విడిచిపెట్టండి.మీ మీడియాతో కల్లబొల్లి కథనాలు వండి వార్చేపద్ధతులు వదిలేయండి.
విశాఖ, కర్నూలు నగరాలపై ద్వేషాన్ని చిమ్మకండి.అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు ఇవ్వండి అని ట్వీట్ చేశారు.
మరి దీనిపై టీడీపి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.ప్రస్తుతం రాష్ట్రంలో రాజధాని అంశం పై రచ్చ జరుగుతుంది ఇది ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
కెనడా: లైవ్ షోలో రిపోర్టర్‌ను లైంగికంగా వేధించిన 9 ఏళ్ల కుర్రాడు.. ఉలిక్కిపడ్డ దేశం..?