అభివృద్ధికి నిదర్శనం చంద్రబాబు-తీగల శేఖర్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: నారా చంద్రబాబు నాయుడు( Nara Chandrababu Naidu) తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి నేటికీ 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ సంబురాలు జరుపుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా తీగల శేఖర్ గౌడ్( Shekhar Goud ) మాట్లాడుతూ చంద్రబాబు 1995,సెప్టెంబర్ 1న తొలిసారి ఏపి సీఎంగా ప్రమాణం చేసారు.

నేటితో 29సంవత్సరాలు పూర్తియ్యాయి.నలుగున్నార దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాయి అయన అందుకున్నారు.

28 ఏళ్లకు ఎమ్మెల్యే,30ఏళ్లకు మంత్రి,45ఏళ్లకు సీఎం అయ్యారు.నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి,తెలుగు ప్రజల అభివృద్ధికి కొత్త దిశలో మార్గదర్శకత్వం వహించారు.

ఆర్థిక సాంకేతిక,రైతు సంక్షేమం, విద్యా రంగాల్లో ఆయన ప్రవేశపెట్టిన విధానాలు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచాయి.

ఆయన దూరదృష్టితో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాయి.ఈరోజు ఆయన నాయకత్వం, విజన్, ప్రజల పట్ల ఉన్న గౌరవం మనకు స్ఫూర్తిదాయకం అని అన్నారు.

ప్రస్తుతం 74 ఏళ్ళ వయసులో నాలుగోసారి సీఎంగా బాత్యతలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో టి,ఎన్,ఎస్,ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి,బింగి వేంకటేశం,మిద్దె ప్రకాశ్,తుమ్మనపెళ్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నాలుగు మందారం ఆకులతో ఇలా చేశారంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది తెలుసా?