కృష్ణవంశీ పై కోపంతో షూటింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన చంద్రమోహన్.. తర్వాతే ఏమైందంటే
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ( Character Artist )గా తనదైన మార్క్ చూపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు చంద్రమోహన్.
మళ్లీ చంద్రమోహన్ ( Chandramohan )ని రీప్లేస్ చేసే వారు తెలుగులో ఇప్పటిదాకా రాలేదు.
కొన్ని సినిమాలు చంద్రమోహన్ నటనతోనే హిట్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు.ఇంత గొప్ప నటుడు ఈరోజు అందర్నీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
చంద్రమోహన్ హీరోగా అప్పటి తరం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికరం ప్రేక్షకులను అలరించాడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా గడుపుతున్న రోజుల్లో ఆయన క్యారెక్టర్ కి ఒక సెపరేట్ కామెడీ టచ్ ఇవ్వాలని డైరెక్టర్ కృష్ణవంశీ( Director Krishnavanshi ) తలచాడు.
నాగార్జున హీరోగా చేసిన నిన్నే పెళ్ళాడతా సినిమాలో చంద్రమోహన్ క్యారెక్టర్ కి ఒక కామెడీ టచ్ ను జోడించాడు.
ఆ క్యారెక్టర్ పేరు మూర్తి, ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది.సినిమా చూసిన వారికి చంద్రమోహన్ ఎంత కొత్త అవతారంలో కనిపించాడో తెలిసే ఉంటుంది.
"""/" /
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణవంశీ చంద్రమోహన్ యాక్టింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు.
స్క్రిప్ లో రాసిన విధంగా కాకుండా చంద్రమోహన్ తనకు నచ్చినట్లు యాక్ట్ చేయడం, అది కృష్ణవంశీకి నచ్చకపోవడం వల్ల వీరి మధ్య కొద్దిగా కోపతాపాలు కనిపించాయి.
చంద్రమోహన్ యాక్ట్ చేస్తున్నాడు కానీ అతని క్యారెక్టర్ జీవం లేకుండా కనిపిస్తోందని కృష్ణవంశీ బాగా డిసప్పాయింట్ అయ్యాడు.
అంతేకాదు చంద్రమోహన్ ని ఒకచోట కూర్చోబెట్టి సార్ మీరు ఇలా చేయాలి అంటూ తనకు సాధ్యమైనంతగా వివరించాడు.
తనకు కావలసినట్టు ఔట్ పుట్ వచ్చేదాకా రీటెక్స్ పదేపదే చేయించాడు.దాంతో బాగా హర్ట్ అయిన చంద్రమోహన్ షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.
"""/" /
మరుసటి రోజు చంద్రమోహన్ షూటింగ్ కు రాగా అతనికి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఎలా నడుస్తుంది? దానిని ఎలా పోషించాలో చాలా వివరంగా మరొకసారి కృష్ణవంశీ చెప్పాడట.
దాంతో చంద్రమోహన్ కి పాత్ర పట్ల ఫుల్ క్లారిటీ వచ్చిందట.ఆ తర్వాత ప్రతి పర్టిక్యులర్ సీన్‌లో చక్కగా డైలాగులు చెప్పిస్తూ చంద్రమోహన్‌ను బాగా నటింపజేశాడు కృష్ణవంశీ.
క్యారెక్టర్ కూడా బాగా అర్థం కావడంతో నెక్స్ట్ అన్ని సీన్లలో చంద్రమోహన్ అద్భుతంగా యాక్ట్ చేశాడు.
కొద్దిరోజుల తర్వాత విడుదలైన నిన్నే పెళ్ళాడతా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ మూవీలో చంద్రమోహన్ డిఫరెంట్ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది.అయితే షూటింగ్ సమయంలో అలిగి వెళ్లిపోయినందుకు కృష్ణవంశీకి చంద్రమోహన్ సారీ కూడా చెప్పాడట.
అయితే ఇవన్నీ కామన్ సార్, సారీలు మనమధ్య వద్దు అని కృష్ణవంశీ నచ్చజెప్పాడట.
ఆ తర్వాత వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
గురుపత్వంత్ పన్నూన్‌కు షాక్ .. ఎస్ఎఫ్‌జేపై ఐదేళ్ల నిషేధం , హోంశాఖ నిర్ణయానికి ఆమోదం