చంద్ర మోహన్ మేనల్లుడు ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అని తెలుసా ?
TeluguStop.com
టాలీవుడ్ లో ఇప్పుడంటే వారసత్వం బాగా కనబడుతుంది.సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారికి ఇండస్ట్రీలో ఎవరో ఒకరితో ఏదో ఒక లింకు ఖచ్చితంగా ఉంటుంది.
దాన్ని పట్టుకుని వాళ్ళు తమ స్థానాన్ని అలాగే పరిచయాలను పెంచుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు వెళుతూ ఉంటారు.
కానీ గతంలో అలా కాదు కష్టపడి పని చేస్తేనే అవకాశాలు అలాగే సినిమాలు.
అలా కాకుండా ఎక్కడ బోల్తా కొట్టిన తిరిగి బస్సు ఎక్కి ఇంటికి వెళ్లాల్సిందే.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే చంద్రమోహన్ కుటుంబం నుంచి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు అనే విషయం.
బయటకు ఎక్కడ ఈ విషయం గురించి తెలియదు.ఆ వారసుడు ఎవరు అనే విషయం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
శివ లెంక కృష్ణ ప్రసాద్.ఈయన చంద్ర మోహన్ కి స్వయానా సోదరి కొడుకు.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు.సినిమా ఇండస్ట్రీ పై మక్కువతో తన మామ చంద్రమోహన్ సహాయం తో శ్రీదేవి మూవీస్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.
మొదట చంద్ర మోహన్ మరియు రాజేంద్ర ప్రసాద్ వంటి నటులతో చిన్నోడు పెద్దోడు అనే ఒక సినిమా తీశారు.
"""/"/
అక్కడ నుంచి మొదలైన శివ లెంక కృష్ణ ప్రసాద్ సినిమా ప్రస్థానం నిన్నటి యశోద మూవీ వరకు కొనసాగింది.
సమంత లీడ్ రోల్ లో వచ్చిన యశోద మూవీ ఆ సంస్థకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.
ఇక బాలకృష్ణ ఆదిత్య 369 సినిమాకు కూడా ఆయనే నిర్మాత.ఆ తర్వాత వంశానిక్కొక్కడు, ఊయల, అనగనగా ఒక అమ్మాయి, భలేవాడివి బాసు, మిత్రుడు, నాని తో జెంటిల్మెన్, సమ్మోహనం వంటి సినిమాలు తీశారు.
"""/"/
అయన నిర్మించిన ఒకటి రెండు తప్ప మిగతా అన్ని సినిమాలు లాభాలను ఆర్జించాయి.
ఇక శివ లెంక కృష్ణ ప్రసాద్ సినిమా నిర్మాణం కాకుండా పంపిణీ పనులు కూడా చేశారు.
అలాగే లైన్ ప్రొడ్యూసర్ గా కొన్నాళ్ళు, అసోసియేట్ ప్రొడ్యూసర్ గా మరి కొన్ని రోజులు పని చేశారు.
చివరగా నిర్మాతగా సెటిల్ అయ్యి నేటికి చిత్ర నిర్మాణం చేపడుతున్నారు.ఇవే కాకుండా టీవీ ఇండస్ట్రీ కి వచ్చి 2012 లో ముత్యమంత పసుపు అనే సీరియల్ నీ కూడా నిర్మించారు.
రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో అనిమల్ హీరో నటిస్తున్నాడా..?