బుద్ధ పౌర్ణమి రోజు వచ్చే చంద్రగ్రహణం సమయంలో ఈ నియమాలు తప్పక పాటించాల్సిందే.. లేదంటే..?!

ఈ సంవత్సరంలో రాబోయే మొదటి చంద్రగ్రహణం మే 16న ఏర్పడనుంది.ఈ చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజున ఏర్పడనుంది.

అంతేకాకుండా అదే రోజు బుద్ధ పూర్ణిమ కూడా అవ్వడం విశేషం అనే చెప్పాలి.

ఈసారి రాబోయే మొదటి చంద్రగ్రహణం వృశ్చికరాశిలో ఏర్పడనుంది కావున దీనిని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు.

ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు.ఈ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు వివిద దేశాల్లో చంద్రుడు ఎరుపు, ముదురు నారింజ రంగులో కనిపిస్తాడు.

అందువల్లే చంద్ర గ్రహణాన్ని బ్లడ్ మూడ్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు.

భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం కాల వ్యవధి 1 గంట 24 నిమిషాలు మాత్రమే.

అంటే ఇది మే 16 న సోమవారం రోజున ఉదయం 07:59 కి ప్రారంభమై మళ్ళీ ఉదయం10:23కి ముగుస్తుంది.

ఈ సంవత్సరం ఇదే కాకుండా మరో చంద్రగ్రహణం వస్తుందని అంచనా వేస్తున్నారు.ఈ రెండు కూడా సంపూర్ణ చంద్రగ్రహణాలు అవ్వడం విశేషం అనే చెప్పాలి.

మరి ఈ చంద్ర గ్రహణం రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఈ చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుందో ముందుగా తెలుసుకుందాం.మే 16న ఏర్పడనున్న చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు.

మన దేశం ఉత్తరార్థ గోళంలో ఉంది.గ్రహణం దక్షిణార్థ గోళంలోని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది.

ఆ లెక్కన మనకు గ్రహణ ప్రభావం ఉండదు. అంటే దక్షిణ-పశ్చిమ ఐరోపా, నైరుతి ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం వంటి దక్షిణార్థ గోళంలోని దేశాలలో కనిపిస్తుంది.

అలాగే ఈ చంద్రగ్రహణం ముందు సూతకం ఏర్పడనుంది.అయితే భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు కావున సూతకం కూడా మన దేశంలో చెల్లదు.

"""/" / ఈ చంద్రగ్రహణం సమయంలో ఎలాంటి పనులు చేయాలి.ఏ పనులు చేయకూడదో తెలుసుకోండి.

గ్రహణం ప్రారంభం అయ్యే కొద్ది గంటల్లో సూతకం మొదలవుతుంది కావున అప్పటి నుంచి గ్రహణం పూర్తయ్యే వరకు పూజలు చేయకూడదు కానీ దేవుడి జపం చేయాలి.

అలాగే సూతకం మొదలు కావడానికి ముందు తులసి ఆకులను, లేదా పచ్చటి గరికను ఆహార పదార్థాలలో వేసుకోవాలి.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రహణ సమయంలో గర్భిణులు బయటకు వెళ్లకూడదు.పని కూడా చేయకుండా ఉంటే మరి మంచిది.

ఇక గ్రహణం ముగిసిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లోని వారందరు తల స్నానాలు చేయాలి.

మరోసారి తల్లైనా బుల్లితెర నటి మహేశ్వరి..వైరల్ అవుతున్న పోస్ట్!