పవన్ కళ్యాణ్ పేరు తలుచుకుంటే చాలు ఆక్సిజన్ లభిస్తుంది: చంద్ర బోస్

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు .

చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

ఇలా నటుడిగా మంచి గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ అనంతరం రాజకీయాలలోకి( Politics ) అడుగుపట్టారు.

జనసేన( Janasena ) పార్టీని స్థాపించిన ఈయన రాజకీయాలలో కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను తీసుకున్నారు.

ఇలా ఈయన డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలను కూడా కాస్త తగ్గించారని చెప్పాలి.

"""/" / ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఆస్కార్ అవార్డు గ్రహీత పాటల రచయిత చంద్రబోస్( Chandra Bose ) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఈయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.పవన్ కళ్యాణ్ గారి పేరు తలుచుకుంటే చాలు నాకు ఏదో కొత్త ఆక్సిజన్ లభిస్తుందని తెలిపారు.

నేను ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు ఇది చేయగలనా అని సందేహం వస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుంటాను.

ఆయన రాజకీయ ప్రయాణమే నాకు ఎంతో స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు .మనిషి సంకల్పబలం గట్టిగా ఉంటే దేనినైనా సాధించని పవన్ కళ్యాణ్ నిరూపించారు.

"""/" / సొంతంగా పార్టీని స్థాపించి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.

ఇలా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వారు రాజకీయాల నుంచి వెను తిరుగుతారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు.

బలంగా నిలబడి, తాను నిలబడడమే కాకుండా, రాష్ట్రం నుండి సెంట్రల్ వరకు అందరినీ నిలబెట్టే స్థాయికి ఎదిగి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు.

అందుకే నాకు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఎంతో స్ఫూర్తిగా ఉంటుందంటూ చంద్రబోస్ పవన్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ సీరంను ట్రై చేయండి!