బాబు ఎత్తు… జ‌గ‌న్ పై ఎత్తు… మామూలు చెక్ పెట్ట‌లేదుగా…!

ఎన్నిక‌ల వ్యూహ క‌ర్త‌.ప్ర‌శాంత్ కిషోర్ ఉర‌ఫ్ పీకేతో సీఎం జ‌గ‌న్ భేటీ అయ్యారు.

దాదాపు గంట‌న్న‌ర పాటు.ఇద్ద‌రి మ‌ధ్య అత్యం త అంత‌ర్గ‌తంగా ఈ స‌మావేశం జ‌రిగింది.

క‌నీసం త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన‌.సాయిరెడ్డిని కానీ, త‌న రాజ‌కీయ స‌ల‌హాదా రు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని కానీ.ఆహ్వానించ‌కుండానే.

జ‌గ‌న్ .పీకేతో భేటీ కావ‌డం పార్టీలో చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే.ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.

రాష్ట్రంలో జ‌గ‌న్ అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.గ‌డిచిన 15 నెల‌ల కాలంలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.

ఇటీవ‌ల మూడు మాసాలుగా .మాత్రం ప‌రిస్థితి చేతులు దాటేలా ఉంద‌నేది వాస్త‌వం.

ఒక‌వైపు నేత‌ల‌పై తీవ్ర అభియోగాలు వ‌స్తున్నాయి.ఇసుక ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా నాయ‌కులు పంచేసుకుంటున్నారు.

మ‌రోవైపు మంత్రులే పేకాట క్ల‌బ్బులు నిర్వ‌హిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి.ఇక‌, రాష్ట్రంలో దేవాల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయి.

మ‌రోవైపు.తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్నఅనేక కీల‌క ప‌థ‌కాల‌కు, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఊహించిన దానిక‌న్నా దారుణంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీంతో జ‌గ‌న్ స‌ర్కారు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతోంది.మ‌రోవైపు రేపో మాపో.

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.ఈ నేప‌థ్యంలో సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకోవాల్సిన అవ‌స‌రం పార్టీకి ఎంతో ఉంది.

"""/"/ గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక ఇదే కావ‌డం.

త‌న ప‌థ‌కాల‌కు ప్ర‌జ‌లు వేసే ఓట్లు కీల‌కం కావ‌డంతో జ‌గ‌న్‌.పీకేతో జ‌రిపిన భేటీకి అత్యంత ప్రాధాన్యం నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో త‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న పరిస్థితుల నుంచి బయటపడటం కోసం సీఎం జ‌గ‌న్‌.

ప్రశాంత్ కిశోర్‌ను సాయం కోరారనే విశ్లేషణలు వస్తున్నాయి.అలాగే తిరుపతి ఉప ఎన్నికపై విగ్రహాల ధ్వంసం ఘటనల ప్రభావం లేకుండా ఉండేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పీకేతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.

జగన్‌ను సీఎం కావడంతో పీకే పాత్ర కూడా చాలానే ఉంది.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కనీవినీ ఎరుగని రీతిలో 151 స్థానాలను గెలుచుకుంది.

ప్రస్తుతం జగన్ సర్కారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో పీకే సలహాలు తీసుకోవాలని సీఎం జగన్ భావించినట్లు చెబుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు ఇక‌పై ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేసే దిశ‌గా స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

మ‌రి పీకే దూకుడు ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి.

వామ్మో, 20,000 మందిని మింగేసిన మిస్టీరియస్‌ ‘అలాస్కా ట్రయాంగిల్’..