యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా గురించి చందూ మొండేటి రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) కథ నచ్చితే టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి ఎప్పుడూ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో చందూ మొండేటి ఒకరు కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా గురించి చందూ మొండేటి( Chandu Mondeti ) చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
తండేల్ సినిమా ప్రమోషన్స్(Tandel Movie Promotions ) లో భాగంగా చందూ మొండేటి ఈ కామెంట్స్ చేశారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి తాను ఒక కథ చెప్పానని కథ అదిరిపోయిందని డెవలప్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని చందూ మొండేటి చెప్పుకొచ్చారు.
ఆ సినిమా కథ డెవలప్ చేసే ప్రాసెస్ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.అయితే ఎన్టీఆర్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలు పూర్తి కావాలంటే మరో రెండున్నర సంవత్సరాల సమయం కచ్చితంగా పడుతుందని చెప్పవచ్చు.
"""/" /
తారక్ తర్వాత సినిమాల దర్శకుల జాబితాలో చందూ మొండేటి చేరతారో లేదో తెలియాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఈ సినిమాలు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వార్2, డ్రాగన్ సినిమాలు ( War2, Dragon Movies )థియేటర్లలో కొన్ని నెలల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి.
ఏడాదికి ఒక సినిమా రిలీజయ్యేలా ఎన్టీఆర్ ప్లానింగ్ ఉంది. """/" /
గత కొన్నేళ్లలో తారక్ పారితోషికం కూడా భారీగానే పెరిగింది.
దేవర మూవీకి 60 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్న తారక్ తర్వాత సినిమాలకు మాత్రం 80 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చందూ మొండేటి తండేల్ సినిమాతో ఏ రేంజ్ హిట్ సాధిస్తారో చూడాల్సి ఉంది.
ఆ పత్రిక ముఖచిత్రంగా బన్నీ ఫోటో.. ఐకాన్ స్టార్ క్రేజ్, రేంజ్ వేరే లెవెల్!