ఫ్రీగా టమాటాలు అందిస్తున్న ఆటోడ్రైవర్.. కాకపోతే ఒక కండిషన్ అట!

భారతదేశంలో రోజురోజుకూ టమాటాల ధర( Tomatoes ) పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

కేజీ టమాటాల ధర రూ.100 పలకడమే చాలా ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఆ ధర రూ.

250కి ఎగబాకింది.కొన్ని చోట్ల ప్రభుత్వం సబ్సిడీ ఆఫర్ చేస్తూ ఉంది కానీ మిగతా దేశమంతటా టమాటాలు ముట్టుకుంటే కాలిపోయేలా మండుతున్నాయి.

ఇలాంటి సమయంలో ఒక ఆటో డ్రైవర్ టమాటాలను ఉచితంగా పంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

"""/" / ఛండీగఢ్‌( Chandigarh ) నివాసి అయిన ఈ ఆటో డ్రైవర్ పేరు అరుణ్.

( Auto Driver Arun ) అయితే ఇతడు టమాటాలను ఇవ్వడం వెనక ఒక స్వార్థం ఉంది.

అదేంటంటే, ఉచిత టమాటాల స్కీమ్ తో అతడు తన ప్రయాణ ఆదాయం పెంచుకోవాలనుకున్నాడు.

అందుకే టమాటాలను ఊరికే ఏం ఇవ్వడం లేదు.తన ఆటోలో ఐదు సార్లు ప్రయాణాలు చేస్తేనే కేజీ టమాటాలు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాడు.

ఇలాంటి స్ట్రాటజీలు అవలంబించడంలో తప్పేం లేదు.గతంలో కూడా చాలామంది ఇలాంటి ఆలోచనలు చేసి లాభపడ్డారు.

"""/" / అయితే ఈ డ్రైవర్‌ని ఒక విషయంలో మెచ్చుకోవచ్చు.అదేంటంటే గత 12 ఏళ్లుగా అరుణ్ ఆర్మీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఫ్రీ రైడ్స్ ఆఫర్ చేస్తున్నాడు.

గర్భిణీలను కూడా తన ఆటోలో ఉచితంగా ఎక్కించుకొని వారి గమ్యస్థానాల మధ్య సురక్షితంగా దింపుతున్నాడు.

రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉన్నా తన వంతుగా ఇలాంటి సోషల్ సర్వీసులు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇక అక్టోబర్‌లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఉందని అందులో భారత్ గెలిస్తే ఛండీగఢ్‌లో ఐదురోజుల పాటు అందరికీ ఉచితంగా రైడ్( Free Ride ) ఇస్తానని కూడా ఈ డ్రైవర్ ప్రకటించాడు.

మొత్తం మీద దేశం, సమాజంపై అతడికి ఉన్న ప్రేమ అందరికీ ముచ్చట గొల్పిస్తోంది.

చరణ్ కియరా జోడికి కలసి రాలేదా…అప్పుడు అలా… ఇప్పుడు ఇలా?