'చాణక్య' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
TeluguStop.com
హీరోగా పరిచయం అయ్యి సక్సెస్ దక్కక పోవడంతో విలన్‌గా మారి నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న గోపీచంద్ మళ్లీ హీరోగా టర్న్ అయ్యి కెరీర్ ఆరంభంలో మంచి విజయాలను దక్కించుకున్నాడు.
కాని ఈమద్య కాలంలో గోపీచంద్‌కు సక్సెస్ అనేదే లేకుండా పోయింది.అయినా కూడా తనవంతు ప్రయత్నాలు అన్నట్లుగా చేస్తూనే ఉన్నాడు.
తాజాగా 'చాణక్య' చిత్రాన్ని విభిన్నమైన నేపథ్యంలో తిరు దర్శకత్వంలో చేశాడు.ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తి కలిగించారు.
మరి సినిమా ఎలా ఉంది, దీంతో అయినా గోపీచంద్‌కు సక్సెస్ దక్కిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
H3 Class=subheader-styleకథ :/h3p
గోపీచంద్ ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడు.
బ్యాంక్ ఎంప్లాయిగా, సీక్రెట్ రా ఏజెంట్‌గా గోపీచంద్ కథలో భాగం అయ్యి ఉంటాయి.
పాకిస్థాన్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని రా ఏజెంట్ కరాచీ వెళ్లి ఎలా పట్టుకున్నాడు అనేది ఈ చిత్రం కథాంశం.
ఇందులో బ్యాంక్ ఎంప్లాయి పాత్ర ఏంటీ అనేది సస్పెన్స్.ఇలాంటి కథలు వచ్చాయి కాని కథను నడిపించిన తీరు విభిన్నంగా ఉంది.
సింపుల్ స్టోరీ లైన్‌ను చక్కగా నడిపించారు.h3 Class=subheader-styleనటీనటుల నటన :/h3p
గోపీచంద్ ఎప్పటిలాగే తనదైన తరహాలో నటన కనబర్చాడు.
రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన గోపీచంద్ రా ఏజెంట్‌గా మాత్రం అలరించాడు.బ్యాంక్ ఎంప్లాయిగా గోపీచంద్ అంతగా కామెడీ పండించడంలో విఫలం అయ్యాడు.
హీరోయిన్ మెహ్రీన్‌తో ఈయన రొమాన్స్ పెద్దగా బాగోలేదు.యాక్షన్ సన్నివేశాల్లో గోపీచంద్ మంచి నటన కనబర్చాడు.
ఓవరాల్‌గా గోపీచంద్ తన పాత్రకు పర్వాలేదు అన్నట్లుగా న్యాయం చేశాడు.ఇక హీరోయిన్ మెహ్రీన్‌కు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు.
ఆమెకు ఉన్న ఒక్కటి రెండు సీన్స్‌లో కూడా ఆమె నటన సాదా సీదాగానే ఉంది.
సునీల్ కామెడీతో నవ్వించడంలో విఫలం అయ్యాడు.మిగిలిన వారు కూడా అంతంత మాత్రంగానే రాణించారు.
"""/"/
H3 Class=subheader-styleటెక్నికల్ :/h3p
సంగీతం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.పాటల గురించి అస్సలు మాట్లాడుకోనికి లేదు.
కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది.కొన్ని యాక్షన్ సీన్స్ స్థాయి పెంచేందుకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.
ముఖ్యంగా పలు సీన్స్‌లో సస్పెన్స్‌ను క్రియేట్ చేయడంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయ్యింది.
సినిమాటోగ్రఫీ బాగుంది.పాకిస్తాన్ వాతావరణంను కళ్లకు కట్టినట్లుగా చూపించడంలో సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది.
యాక్షన్ సీన్స్‌లో కూడా సినిమాటోగ్రఫీ బాగా పని చేసింది.దర్శకుడు తిరు స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.
కథను ఆసక్తికరంగా నడపడటంతో పూర్తి స్థాయిలో ఈయన సఫలం కాలేదు.కొన్ని సీన్స్ లెంగ్తీగా బోరింగ్‌గా అనిపించాయి.
కొన్ని యాక్షన్ సీన్స్ లెంగ్త్ కూడా తగ్గిస్తే బాగుండేది.మొత్తానికి ఎడిటింగ్‌లో లోపాలున్నాయి.
నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి.h3 Class=subheader-styleవిశ్లేషణ :/h3p
దర్శకుడు తిరు రొటీన్ స్టోరీ లైన్‌ను కొత్తగా చూపించేందుకు ప్రయత్నించాడు.
కాని రొటీన్ స్టోరీని చాలా రొటీన్‌గానే ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేశాడు.కామెడీ విషయంలో కూడా పరమ రొటీన్ స్క్రీన్‌ప్లేను ఆయన నడిపించాడు.
హీరో గోపీ చంద్‌ను దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేక పోయాడనిపించింది.నటీనటులు చాలా మంది ఉన్నా కూడా దర్శకుడు స్క్రీన్‌ప్లే సరిగా నడపడంలో విఫలం అవ్వడం వల్ల ఏ ఒక్కరికి ప్రాముఖ్యత అనిపించలేదు.
సినిమా మొదటి సగం బాబోయ్ అన్నట్లుగా ఉంది.కాని సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదు అన్నట్లుగా సాగింది.
ఫస్ట్ హాఫ్ మాదిరిగానే సెకండ్ హాఫ్ కూడా ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించనక్కర్లేదు.
గోపీచంద్‌కు ఇది తప్పకుండా విజయం సాధించి పెడుతుందని నమ్మిన ఆయన ఫ్యాన్స్‌కు ఇది నిరాశ కలిగిస్తుంది.
హీరోగా నటించే విషయంలో గోపీచంద్ తన నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాల్సిన తరుణం వచ్చిందనిపిస్తుంది.
యావరేజ్‌గా ఉన్న చాణక్య చిత్రం 'సైరా' సునామి ముందు నిలవడం కష్టమే. """/"/
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్ :/h3p
హీరోయిన్ గ్లామర్,
పాకిస్తాన్‌లో సీక్రెట్ ఆపరేషన్ సీన్స్
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్ :/h3p
కథ, స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం,
ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం,
సంగీతం, ఎడిటింగ్
H3 Class=subheader-styleబోటమ్ లైన్ :/h3p
'చాణక్య' కొందరికి మాత్రమే నచ్చుతాడు.
మాస్ జాతర గ్లింప్స్ తో రవితేజ ఈజ్ బ్యాక్ అనాల్సిందేనా..?ఒకప్పటి రవితేజ గుర్తుకు వచ్చాడా..?