ఆ దర్శకుడు అవకాశం ఇప్పిస్తానని రమ్మని ముద్దు పెట్టడానికి....

తెలుగులో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన "చాణక్య" చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయమైన ముంబై బ్యూటీ "జరీన్ ఖాన్" గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

అయితే ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై సెలబ్రిటీలకు అవగాహన పెరగడంతో ప్రతి ఒక్కరూ తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెబుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా జరీన్ ఖాన్ కూడా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తాను గతంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి స్పందించింది.

అయితే ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో తనకు ఇక్కడ పెద్దగా ఎవరూ తెలియదని ఈ క్రమంలో ఓ వ్యక్తి తాను దర్శకుడనంటూ తనతో పరిచయం ఏర్పరచుకున్నాడని తెలిపింది.

ఈ క్రమంలో ఓసారి తనకు సినిమా ఆఫర్ ఇప్పిస్తానని కానీ అందులో కొన్ని ముద్దు సీన్లు ఉన్నాయని కాబట్టి వాటికోసం ఒకసారి ప్రాక్టీస్ చేయాలంటూ ముద్దు పెట్టబోయాడని తెలిపింది.

దాంతో తాను అసలు విషయం అర్థం చేసుకుని అక్కడి నుంచి చాకచక్యంగా వెళ్లిపోయానని ఆ తర్వాత మళ్లీ ఆ దర్శకుడిని కలిసే ప్రయత్నాలు చేయలేదని చెప్పుకొచ్చింది.

అయితే సినిమా పరిశ్రమలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారని కాబట్టి అవకాశాల పేరుతో మోసపోకుండా చాకచక్యంగా వ్యవహరించాలని నూతన నటీనటులకు సూచించింది.

"""/"/ ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జరీనా ఖాన్ బాలీవుడ్ లో వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది.

అంతేకాకుండా ఈ అమ్మడు ఒకపక్క సినిమాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూనే మరోపక్క స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తోంది.

కాగా ప్రస్తుతం హిందీ లో ప్రముఖ దర్శకుడు హరీష్ వ్యాస్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

కెమెరాలో చిక్కిన సీక్రెట్ మూమెంట్.. మెలానియా ట్రంప్‌కు గవర్నర్ ముద్దు.. వీడియో వైరల్..