Rajasthan Royals : ఐపిఎల్ మొదటి సీజన్ లో చాంపియన్స్..మరి ఇప్పుడు రాజస్థాన్ పరిస్థితి ఏంటి..?
TeluguStop.com
ఐపీఎల్ సీజన్ 17( IPL 17 ) మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది.
ఇక మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే మొదటి ఐపిఎల్ సీజన్ లో షేన్ వార్న్ సారథ్యం లో ఛాంపియన్స్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్( Rajasthan Royals ) టీం.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కప్పు కొట్టలేకపోయింది.ఇక దానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ఆ టీం ఎప్పటికప్పుడు వాళ్ల లోటు పాట్లను తెలుసుకుంటూ ముందుకు సాగుతుంది.
"""/" /
ఇక ప్రస్తుతం ఈ టీమ్ కి సంజు శంసాన్( Sanju Samson ) కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
అయినప్పటికీ ఏదో ఒక రకంగా టోర్నీ నుంచి వెనుతిరిగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.
ఇక వాళ్లు 2008 లో చాంపియన్స్ గా నిలిస్తే.2013, 2015,2018 లో ప్లే ఆఫ్ కి చేరుకున్నప్పటికి ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది.
ఎందుకంటే ప్లే ఆఫ్ లో వాళ్ళ పర్ఫామెన్స్ దారుణంగా ఉండడంతో ఆయా జట్ల మీద ఓడిపోయి టోర్నీ నుంచి వెనుతిరగాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.
ఇక 2022లో ఫైనల్ కి చేరుకున్నప్పటికీ గుజరాత్ టైటాన్స్ టీమ్ చేతిలో ఓటమి పాలైంది.
"""/" /
లో స్కోరింగ్ గేమ్ గా సాగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతులెత్తేసిందనే చెప్పాలి.
ఇక గత కొన్ని సీజన్ల నుంచి ఈ టీం కి సంజూ శాంసాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
అయితే గత సీజన్ లో కూడా ఈ టీం మంచి పర్ఫామెన్స్ ఇస్తు ముందుకు దూసుకు వచ్చినప్పటికీ మొదట్లో చాలా మ్యాచులు ఓడిపోవడం వల్ల ప్లే ఆఫ్ కి( Play Offs ) చేరుకోలేకపోయారు.
దానివల్లే ఆ టీం కి భారీ మైనస్ గా మారిందనే చెప్పాలి. """/" /
అయితే ఈ టీంలో మ్యాచ్ ను గెలిపించగల ప్లేయర్లు చాలామంది ఉన్నప్పటికీ తీరా సమయానికి మాత్రం ప్లేయర్లందరు చతికలబడిపోవడం అనేది ఈ టీం కి కొంతవరకు మైనస్ గా మారుతుంది.
ముఖ్యంగా ఓపెనర్లు అయిన బట్లర్,( Buttler ) జైశ్వాల్( Jaiswal ) ఇద్దరు కూడా అద్భుతమైన ఫామ్ లో ఉండి ప్రతి మ్యాచ్ లో వాళ్లు తమ వంతు స్కోర్ అయితే చేయగలుగుతున్నారు.
ఇక ఈ టీం కెప్టెన్ అయిన శాంసాన్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి టీమ్ ను ఛాంపియన్స్ నిలపాలని చూస్తున్నాడు.