జబర్దస్త్ లో రోజాగారు అలా ప్రవర్తిస్తారు.. చమ్మక్ చంద్ర కామెంట్స్ వైరల్!
TeluguStop.com
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో చమ్మక్ చంద్ర కూడా ఒకరనే సంగతి తెలిసిందే.చమ్మక్ చంద్ర పాల్గొన్న కామెడీ షోలలో ఎక్కువ షోలు హిట్ అయ్యాయి.
ఒకవైపు టీవీ షోలలో మరోవైపు సినిమాలలో చేస్తూ చమ్మక్ చంద్ర సత్తా చాటుతున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో చమ్మక్ చంద్ర రోజా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాగబాబు టీంలో ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుని అందరినీ కోఆర్డినేట్ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
స్కిట్స్ బాగా చేసిన వాళ్లను ఆయన ఎంతగానో ప్రశంసిస్తారని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
స్కిట్స్ సరిగ్గా చేయకపోతే నాగబాబు గారి నుంచి వార్నింగ్ లు వస్తాయని ఆయన చెప్పేవారని చమ్మక్ చంద్ర అన్నారు.
నాగబాబు మమ్మల్ని అలర్ట్ చేయడం వల్లే జబర్దస్త్ షో ఈ స్థాయిలో సక్సెస్ సాధించిందని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
ఇన్ఫెక్షన్ వల్ల మూడు నెలలు తాను జబర్దస్త్ కు దూరమయ్యానని చమ్మక్ చంద్ర పేర్కొన్నారు.
డాక్టర్ సూచనల మేరకు తాను రెస్ట్ తీసుకున్నానని చమ్మక్ చంద్ర అన్నారు.జబర్దస్త్ షోలో రోజాగారు రాజకీయాలకు తనకు ఏ మాత్రం సంబంధం లేని విధంగా ఉండేవారని చమ్మక్ చంద్ర వెల్లడించారు.
రోజాగారు చిన్నపిల్లలా ఉండేవారని కమెడియన్లపై ఆమె ఎప్పుడూ కోప్పడలేదని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు.
మేడమ్ జోకులు వేస్తూ అందరితో సరదాగా ఉంటారని ఆయన అన్నారు. """/"/
తాను అవయవాలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నానని అవయవదానం మంచి నిర్ణయమని భావించి చేస్తున్నానని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు.
తెల్లవారే వరకు మనం ఏమిటో తెలియదని మనం చనిపోయినా ఒక మనిషికి ఉపయోగపడుతున్నాయంటే ఏమిటని చమ్మక్ చంద్ర కామెంట్లు చేశారు.
చమ్మక్ చంద్ర చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.రోజాకు ప్రస్తుతం మంత్రి పదవి దక్కిందనే సంగతి తెలిసిందే.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 19, శుక్రవారం 2024