ఊసరవెల్లులే వీరికంటే నయం…!

యాదాద్రి భువనగిరి జిల్లా:ఎన్నికల వేళ రాజకీయ నాయకులు చిత్రవిచిత్ర విన్యాసాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.

కానీ,ఈ సారి ఆ పనిని అన్ని పార్టీల కార్యకర్తలు భుజానికి ఎత్తుకునట్లు కనిపిస్తుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) సంస్థాన్ నారాయణపురం మండలంలో తాజా రాజకీయ పరిస్థితిని చూస్తే ఎవరికైనా అసహనం వేయకమానదు.

గత మునుగోడు( Munugodu ) ఉప ఎన్నికల్లోమొదలైన కండువాల మార్పిడి నేటి సాధారణ ఎన్నికల నాటికి తారాస్థాయికి చేరి,వారిని చూసి ఊసరవెల్లులే సిగ్గు పడేలా చేస్తున్నారు.

ఈ రోజు ఈ పార్టీలో ఉంటే రేపు ఏ పార్టీలో ఉంటారో గ్యారెంటీలేని అయోమయ స్థితికి మండల రాజకీయం చేరుకుంది.

ప్రస్తుతం పార్టీలు మారే వారంతా అక్కడైనా చివరి వరకు ఉంటారా?మళ్ళీ ఏ పార్టీ అధికారంలో వస్తే అందులో దూరిపోతారా అంటే ఆడే కాలు రోలు కింద పెట్టినా ఆగదని, అలవాటుపడ్డ ప్రాణం అధికారం ఉన్న చోటే ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నారాయణపురం ఓటరు నాడి ఎవరికీ అంతు చిక్కక ఎమ్మెల్యే అభ్యర్దులు ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు.

బాలయ్య డాకు మహరాజ్ హిట్ తో చిరంజీవి మీద ప్రెజర్ పెరుగుతుందా..?