సీఎం రేవంత్, హరీశ్ రావు మధ్య సవాళ్ల పర్వం.. గన్ పార్క్ వద్ద హై టెన్షన్.!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది.

ఈ మేరకు ఆగస్ట్ 15 లోపు రైతు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటారా అంటూ హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆగస్ట్ 15 లోపు రైతు రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు మళ్లీ పోటీ చేయబోనని హరీశ్ రావు ఛాలెంజ్ చేశారు.

ఒకవేళ ఆ సమయానికి రుణమాఫీ, గ్యారెంటీలను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాజీనామా లేఖలతో అమరుల స్థూపం వద్దకు రావాలని చెప్పారు.అక్కడే ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతిలో పెడదామని హరీశ్ రావు తెలిపారు.

హామీలను రేవంత్ రెడ్డి నెరవేర్చితే తన రాజీనామాను స్పీకర్ కు ఇస్తానని హరీశ్ రావు ( Harish Rao )వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఆయన ఇవాళ గన్ పార్క్ కు చేరుకోనున్నారు.నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

అదేవిధంగా గన్ పార్క్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్న పోలీసులు అక్కడి నుంచి నేతలు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.

గన్ పార్క్ వద్దకు హరీశ్ రావుతో పాటు ఐదుగురికే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.

దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వైఫ్ కోసమే డైలీ 320 కి.మీ ప్రయాణిస్తున్న చైనీస్ వ్యక్తి..!