చలపతి రావుని నిరాశపరచని సంతానం. ముగ్గురు పిల్లల ఘనత తెలుసా ?

సినిమా ఇండస్ట్రీ ఒక్కొక్కరిగా దిగ్గజాలను కోల్పోతుంది.కృష్ణం రాజు మరణంతో ఈ ఏడాది దిగ్గజ నటుల మరణాలు మొదలైతే చివరి నెల వచ్చేసరికి సూపర్ స్టార్ కృష్ణ, ఆ తర్వాత కైకాల సత్యనారాయణ, చలపతి రావు వంటి వారు కన్ను మూయడం తో ముగింపుకు చేరుకుంది.

ఎదో చెడు సూచకంగా అందరిని ఈ విషయం కలవరపెడుతున్న, విధిని ఎదురించడం ఎవరికి సాధ్యం కాదు కదా.

ఇక నిన్న చలపతి రావు మరణ వార్త మాత్రం అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.

ఎందుకంటే అప్పటికే కైకాల చనిపోయి ఒక్క రోజు కూడా కాలేదు.పైగా చలపతి రావు చాల ఆరోగ్యంగా ఉన్నాడు.

అందుకే ఈ మరణం కొంత అందరిని బాధించింది.కానీ చలపతి రావు మాత్రం నిండు జీవితాన్ని ఎంతో బాగా అనుభవించాడు.

ఒక్క భార్య లేని లోటు తప్ప పిల్లలు బాగా సెటిల్ అయ్యారు.చనిపోతున్న భార్యకు మరో పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చిన పిల్లలను వృద్ధి లోకి తేవాలని మాత్రమే ముఖ్య ద్యేయం గా పెట్టుకున్నాడు.

ఇక ఆయనకు చివరి వరకు తృప్తి ని ఇచ్చింది కూడా అదే.చలపతి రావు ముగ్గురు పిల్లలు.

కొడుకు రవి బాబు దర్శకుడిగా, నటుడిగా మనం చూస్తూనే ఉన్నాం. """/"/ ఇక ఇద్దరు కూతుళ్లు అమెరికాలో స్థిర పడ్డారు.

చాల మంది నటుల వారసుల మాదిరి కాదు చలపతి రావు పిల్లలు.చదువుల్లో ఎంతో ముందు ఉండేవారు.

ఈ విషయంలో ఎంతో గర్వంగా ఉంది అంటూ ఇంటర్వూస్ లో చెప్పాడు కూడా.

రవి బాబు కొన్ని వివాదాల విషయం పక్కన పెడితే చదువుల్లో ఎంతో చురుకైన వాడు.

వరసగా మూడేళ్ళ పాటు గోల్డ్ మెడల్ సాధించాడు.ఇక చలపతి రావు పెద్ద అమ్మాయి మాలిని దేవి ఏం ఏ లిటరేచర్ లో గోల్డ్ మెడల్ సాధించింది.

"""/"/ పెళ్లి చేసుకొని అమెరికా లో ఉంటుంది.చిన్న అమ్మాయి శ్రీదేవి చదువులు అమెరికాలోను పూర్తి చేసింది ఏం ఎస్ కోసం అమెరికా వెళ్లి అక్కడ డెట్రాయిట్ యూనివర్సిటీ లో టాపర్ గా నిలిచింది.

ఇలా తన ముగ్గురు పిల్లలు తనను ఎప్పుడు నిరాశ పరచలేదని పలుమార్లు చలపతి రావు చెప్పుకోచ్చాడు.

ఏది ఏమైనా ఒక తండ్రికి కావాల్సింది ఇంతకంటే ఏముంటుంది చెప్పండి.

నా విజయ రహస్యం అదే… పెళ్లి అంటే పూల పాన్పు కాదు… ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు!