సినిమా ప్రమోషన్ కోసం కుటుంబాన్ని బాగా వాడుకుంటున్న చైతూ!

నాగచైతన్య విడాకుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే లవ్ స్టోరీ బంగారు రాజు వంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య త్వరలోనే థాంక్యూ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో హాకీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా థాంక్యూ.

ఈ సినిమా ఈనెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య ఏకంగా తన కుటుంబాన్ని కూడా బీభత్సంగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే మీ మనసుకు నచ్చిన వారు మీ కష్ట సమయాల్లో మీకు అండగా ఉన్నవారికి థాంక్యూ చెప్పండి అంటూ చెప్పుకొచ్చారు.

ఇక తన జీవితంలో కూడా ముగ్గురు వ్యక్తులు ఎంతో కీలకంగా ఉన్నారని నాగచైతన్య ఈ సందర్భంగా చెబుతూ వారికి థాంక్యూ చెప్పారు.

"""/" / తనకు చిన్నప్పటి నుంచి అన్ని విషయాలలో అండగా ఉండి తనని ప్రోత్సహించిన తన తల్లికి,ప్రతి విషయంలోనూ ఒక స్నేహితుడిగా తనకు స్నేహాన్ని పంచ ప్రోత్సహించినందుకు తన తండ్రికి, తనను ఒక మనిషిగా ఉంచినందుకు ఎలా ప్రేమించాలో చూపించినందుకు తన కుక్కకి కూడా థాంక్యూ చెబుతూ నాగచైతన్య ఈ ముగ్గురి ఫోటోలను షేర్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ చేశారు.

ఈ విధంగా నాగచైతన్య తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మొదటిసారి కుటుంబం గురించి ప్రస్తావించారు.

ఇకపోతే ఈ సినిమా జులై 8వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల జూలై 22వ తేదీకి వాయిదా పడింది.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి.

పొట్ట కొవ్వును ఐసు ముక్కలా కరిగించే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!