నిహారికకు విడాకులు…తన స్నేహితురాలితో రెండో పెళ్లి.. నిహారికకు షాక్ ఇచ్చిన చైతన్య?
TeluguStop.com
నిహారిక కొణిదేల పరిచయం అవసరం లేని పేరు.మెగా వారసురాలిగా బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె తన మాట తీరుతో అందరిని ఆకట్టుకున్నారు.
ఇలా యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్నటువంటి నిహారిక ( Niharika ) అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కానీ హీరోయిన్గా మాత్రం ప్రేక్షకులను పెద్దగా సందడి చేయలేకపోయారు.
ఇక హీరోయిన్గా ఈమె పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో తన తల్లిదండ్రులు ఈమెకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు.
నిహారికను జొన్నలగడ్డ వెంకట చైతన్య ( Jonnalagadda Venkata Chatanya ) అనే అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు.
వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితంలో నిహారిక ఎంతో సంతోషంగా ఉన్నారు.
అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయో తెలియదు కానీ చివరికి విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇలా పెళ్లైన రెండు సంవత్సరాలకి నిహారిక జొన్నలగడ్డ వెంకట్ చైతన్య విడిపోవడంతో వీరిద్దరూ కూడా ప్రస్తుతం ఎవరి కెరియర్ పై వారు ఫోకస్ పెట్టారు.
ఇక విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక తిరిగి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఈమె హీరోయిన్ గాను అలాగే నిర్మాతగాను కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/12/chaitanya-is-going-to-orce-niharika-and-marry-her-friend-for-the-second-timea!--jpg" /
ఇకపోతే నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈయన త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారని అయితే రెండో పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదో స్వయంగా నిహారిక ప్రాణ స్నేహితురాలినే కావడం విశేషం అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
ఈమె నిహారికకు అత్యంత సన్నిహితురాలని ఈమె నిహారిక పెళ్లి వేడుకలలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇక నిహారిక చైతన్య పెళ్లి కుదిరిన తర్వాత నిహారిక తన స్నేహితురాలిని చైతన్యకు పరిచయం చేశారు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఉంది.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/12/chaitanya-is-going-to-orce-niharika-and-marry-her-friend-for-the-second-timeb!--jpg" /
నిహారికను పెళ్లి చేసుకుని తనతో విడాకులు తీసుకున్న తర్వాత ఈయన తన స్నేహితురాలిని రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట అయితే ఈమె సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఫ్యామిలీ కాదని సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ నిహారికకు స్నేహితురాలని తెలుస్తుంది.
ఈ అమ్మాయి ప్రముఖ బిజినెస్ కుమార్తె అంటూ కూడా ఈ ఒక వార్త వైరల్ అవుతుంది.
త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.చైతన్య నిహారిక స్నేహితురాలిని చేసుకోబోతున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే నిహారికకు చైతన్య గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి.
మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.