అరెరే.. వందల్లో కొన్న కుర్చీ లక్షల్లో అమ్ముడయింది.. అసలు మ్యాటర్ ఏంటంటే..!?

దురదృష్టం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది.అదే అదృష్టం అనేది ఎప్పుడో ఒకసారి మాత్రమే తలుపు కొడుతుంది అనే సామెత గురించి మీరు వినే ఉంటారు.

ఎందుకంటే అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి.ఒక్కోసారి అదృష్టవంతుడు మట్టి పట్టుకున్నాగాని బంగారం అయిపోతూ ఉంటుంది.

అప్పుడే అంటూ ఉంటాము కదా వాళ్ళకి అదృష్టం దురదృష్టం పట్టినట్లు పట్టింది కదా అని.

అదృష్టం మన తలుపులు తట్టినప్పుడు అందుకున్న వారే నిజమైన అదృష్టవంతులు అవుతారు.ఈ క్రమంలోనే ఒక మహిళకు కూడా అదృష్టం తలుపులు తీసేసుకుని మరి ఇంట్లోకి వచ్చేసింది.

వందల్లో కొన్న ఆ పాత కుర్చీ కాస్త లక్షల్లో అమ్ముడు పోయింది.ఉన్నటుండి ఒక్కసారిగా లక్షదికారి అయి పొయింది.

అది ఎలా అనుకుంటున్నారా.? చాలా మంది పాత వస్తువులను పనికి రావు అనుకుని బయట పడేస్తూ ఉంటారు.

మరి కొందరు అవే పాత వస్తువులను తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని కొనుకుంటున్నారు.

అలాగే బ్రిగ్​టన్ కు చెందిన ఒక మహిళ కూడా పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఒక పాత చెక్క కుర్చీని కొనుగోలు చేసింది.

అ కుర్చీ యొక్క ధర 5 పౌండ్లు అంటే మన ఇండియన్ కరెన్సిలో 500 రూపాయల వరకూ ఉంటుంది.

ఆ కుర్చీని కొని ఆమె ఇంట్లోకి తీసికుని వచ్చింది.అయితే ఆమె బంధువుల్లో ఒకరు ఆ కుర్చీ మీద రాసి ఉన్న తేదిని పరిశీలనగా చూసి దానిపై స్టడీ చేయగా ఆ కుర్చీకి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు అప్పుడు తెలిసాయి.

"""/" / ఆ కుర్చీ 20వ శతాబ్దానికి చెందిన వియన్నా ఎవంట్​ గార్డే ఆర్ట్​ స్కూల్​కి చెందిన కుర్చీ అంట.

మోడ్రన్​ ఆర్ట్​ వర్క్​లో ఆస్ట్రియాలోనే మంచి పేరున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆస్ట్రియన్​ పెయింటర్​ కోలోమన్​ మోసర్ అనే వ్యక్తి 1902లో ఈ కుర్చీని నిచ్చెన తరహా స్టైల్​లో పట్టీలను ఉపయోగించి డిజైన్ చేయడం జరిగింది.

ఈ విషయాలను కుర్చీ కొన్న మహిళకు ఆమె బంధువు వివరించాడు.కాగా సదరు మహిళ ఆ పాత కుర్చీ గురించి ఓ ప్రముఖ వేలం సంస్థకు తెలపడంతో వాళ్లు దానిని​ వేలం వేశారు.

ఆస్ట్రియాకు చెందిన ఓ డీలర్​ దానిని 16,250 పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో 16 లక్షలకు పైనే చెల్లించి ఈ పురాతన కుర్చీని  దక్కించుకున్నాడు.

ఇంకో విశేషం.ఏంటంటే దాదాపు 120 ఏళ్లు గడుస్తున్నా కానీ ఆ కుర్చీ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది.

ఓల్డ్ ఇజ్ గోల్డ్ అంటే బహుశా ఇదే కాబోలు.

Junior NTR: పది సెకన్ల సీన్ లో ఆరు ఎమోషన్లు.. తారక్ గొప్ప నటుడని చెప్పడానికి ప్రూఫ్ ఇదే!