చైనా ఉచ్చులో పూర్తిగా పాకిస్తాన్.భారీగా ఆయుధాలు కొంటున్న పాకిస్తాన్

కష్ట సమయంలో యావత్ ప్రపంచం తనని దూరం చేసిన తనకు అండగా నిలిచిన సౌదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారితో ఉన్న సత్సంబంధాలను పాకిస్తాన్ నాయకులు దెబ్బతీశారు.

ప్రస్తుతం వాటిని సరి చేయడానికి మిలటరి జనరల్ బజ్వా రియాద్ కు పయనమయ్యారు.

ఇక చైనా ఎరవేసి అప్పుల ఊబిలో బయటకు రాలేనంత లోతుగా చిక్కుకున్న పాకిస్తాన్ ఇప్పుడు చైనా చేతిలో కీలుబొమ్మ అవుతుంది.

ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న కథనాల ప్రకారం చైనా చేతిలో పాకిస్తాన్ మరో టిబెట్ లా మారనున్నది.

తాజాగా పాకిస్థాన్ ఇతర దేశాల నుండి అప్పుల రూపంలో తెచ్చుకున్న డబ్బులను చైనా వద్ద భారీగా ఆయుధాలను కొనడానికి వినియోగిస్తుంది.

ఈ ఆయుధాలను టెర్రరిస్టులకు అందించడానికి పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్లు భారత నిఘా వర్గాలు భారత ప్రభుత్వానికి సమాచారాన్ని అందించాయి.

గత కొంతకాలంగా కాశ్మీర్ లోనూ బోర్డర్ లోనూ భారత సైనికులు ఉగ్రవాదులను అటు పాకిస్థాన్ సైనికులను దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు.

అందుకే ఉగ్రవాదులకు అధునాతన ఆయుధాలు అందించడానికి పాకిస్తాన్ చైనా వద్ద ఈ ఆయుధాలను కొనుగోలు చేస్తుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పాకిస్తాన్ ప్రస్తుతం చైనా నుండి కొనుగోలు చేస్తున్న ఆయుధాలలో గగన తలం నిఘా పెట్టేందుకు బెలూన్ రాడార్లు, సాయుధ డ్రోన్లు కొనుగోలు చేస్తుండగా.

భారత సైన్యం చేసే దాడిని తట్టుకోవడానికి మిలిటరీ కంబాట్ బాలిస్టిక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, స్టీల్ బుల్లెట్లు, ఆర్టిలరీ గన్స్, ఎత్తయిన ప్రదేశాల్లో ఉపయోగించే పరికరాలు, వస్త్రాలు, కళ్ళజోళ్లు, చేతులకు గ్లౌవ్స్ వంటివాటిని కొనుగోలు చేస్తుంది.

ఏందిరా అయ్యా.. బట్టతలపై జుట్టు వస్తుందంటే ఇంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారా.?