భయపెడుతున్న కరోనా బాధితుల సంఖ్య

ప్రపంచ దేశాలకు అమెరికా తర్వాత పెద్దన్న అని చెప్పుకునే చైనా ఇప్పుడు కరోనా బారిన పడి విలవిలాడిపోతుంది.

చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలకు ప్రాకింది.చైనా నుండి ఇండియాకు వచ్చిన ద్వారా ఇండియాలో కూడా కరోనా వైరస్‌ మొదలైంది.

అయితే చైనా తరహాలో కరోనా ఇతర దేశాల్లో అత్యధికంగా ప్రాకడం లేదు.ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య చూస్తే ప్రపంచమే అవాక్కవుతునంది.

కరోనా వైరస్‌ నిర్ధారణ అయ్యింది ప్రస్తుతం 20 వేల మందికి.అయితే ఆ లక్షణాలు కనిపిస్తు ఇంకా నిర్థారణ అవ్వని వారు దాదాపుగా రెండున్నర లక్షల మంది ఉన్నారట.

అంటే వారిలో కనీసం రెండు లక్షల మందికి అయినా కరోనా వైరస్‌ సోకి ఉంటుందనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.

వారం నుండి పది రోజుల్లో ఆ రెండున్నర లక్షల మంది పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అంత మందికి వైరస్‌ ఉంది అంటే ఖచ్చితంగా వారికి డబుల్‌ సంఖ్యలో నెల రోజుల్లో కరోనా వైరస్‌ బాధితులు బయట పడతారు అంటున్నారు.

అంటే ఈ సంఖ్య పెరుగుతూనే పోతుంది.లక్షల్లో ఈ సంఖ్య నమోదు అవుతున్న నేపథ్యంలో చైనా మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలే ఆందోళన చెందుతున్నాయి.

బైక్ రైడ్ చేస్తూ ఆశ్చర్యపరిచిన ఎలుగుబంటి.. రష్యాలో అంతే..?