అదేంటి, చాట్ జీపీటీ గురించి విన్నాం కానీ, ఈ చాయ్ జీపీటీ( Chai GPT ) ఏంట్రా బాబు అని అనుమానం వస్తోంది కదూ.
వివరాలు తెలియాలంటే మీరు ఈ కధనం పూర్తిగా చదవసిందే.చాలామంది వ్యాపారులు కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తారు.
ముందుగా చాలామంది చేసిన వ్యాపార ఎత్తుగడ తమ దుకాణాలకు పెట్టే పేర్లు.అవును, తమ క్రియేటివిటీతో చాలా ఐడియాలు చేస్తూ వుంటారు.
ఇటీవల కాలంలో చాలామంది వ్యాపారాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. """/" /
ఈ క్రమంలో కొందరు యువకులు డిగ్రీ పట్టాలు పుచ్చుకొని ఉద్యోగాలు లేక తమకు తామే ఉపాధి కల్పించుకుంటున్నారు.
అందులో భాగంగా వెలసినవే బీటెక్ చాయ్‌వాలా కావచ్చు, గ్రాడ్యుయేట్ చాయ్ దుకాణం( Graduate Chai Shop ) కావచ్చు, బీటెక్ పానీపూరి కావచ్చు.
తాజాగా ఓ వ్యాపారి వీళ్లను తలదన్నేలా ఆలోచించాడు.అవును, ఇతను టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందుకుంటాడా ఏమోగానీ తన చాయ్ దుకాణానికి ‘చాయ్ జీపీటీ’ అంటూ వినూత్నంగా పేరు పెట్టాడు.
"""/" /
కాగా దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సృజనాత్మకత ఉంటే చాలు తమదైన ప్రత్యేక గుర్తింపును సులభంగా తెచ్చుకోవచ్చు అనడానికి మనోడే చిన్న ఉదాహరణ.
ఇటీవల కాలంలో చాట్ జీపీటీ గురించి మనం కధలుకధలుగా వింటున్నాం.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే అప్లికేషన్ ఇది.
మనం ఏ సమాచారం కోరినా క్షణాల్లో మనముందుంచే ఓ టూల్.ఈ నూతన టెక్నాలజీ ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం అవుతోంది.
ఆ విషయం గ్రహించిన ఓ తెలివైన వ్యాపారి ఈ చాట్‌జీపీటీని తన వ్యాపారానికి వాడుకున్నాడు.
ఉగాది పూజలో మెరిసిన చిరంజీవి మనవరాలు.. వైరల్ అవుతున్న క్లీంకార ఫోటోలు!