ఐపీఎల్‌ లో రికార్డు సృష్టించిన చాహల్‌

ఐపీఎల్‌ లో రికార్డు సృష్టించిన చాహల్‌

ఐపీఎల్ 2022 లో సంచలనం నమోదయ్యింది.రెండు నెలల పాటు క్రికెట్‌ ప్రేమికులను ఉర్రూతలూగించిన ఐపీఎల్​ 15వ సీజన్​లో గుజరాత్​ టైటాన్స్​ జట్టు విజేతగా​ నిలిచింది.

ఐపీఎల్‌ లో రికార్డు సృష్టించిన చాహల్‌

అరంగేట్ర సీజన్ లోనే ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది.ఎలాంటి అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చి చాంఫియన్‌గా అవతరించింది.

ఐపీఎల్‌ లో రికార్డు సృష్టించిన చాహల్‌

ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టికరిపించి విజేతగా నిలిచింది.ఇక, ఈ మ్యాచులో కొన్ని రికార్డులు బద్దలయ్యాయ్.

ఒక ఐపీఎ్‌ సీజన్‌లో స్పిన్నర్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు.

పర్పుల్ క్యాప్ రేసులో నేనే నెం.1 అనేలా ఈ సీజన్ లో రెచ్చిపోయిన చాహల్ చివరికి దాన్ని దక్కించుకున్నాడు.

గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్‌ పోరులో హార్దిక్‌ పాండ్యాను ఔట్‌ చేయడం ద్వారా ఈ సీజన్‌లో చహల్‌ 27వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో సూపర్‌ ఫామ్‌తో దూసుకెళ్తున్న చాహల్‌ ఓవరాల్‌గా 17 మ్యాచ్‌ల్లో 7.75 ఎకానమీ రేటుతో 27 వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇక, ఇమ్రాన్‌ తాహిర్‌(26 వికెట్లు) రికార్డును బ్రేక్‌ చేసిన చహల్‌ తొలి స్థానానికి దూసుకెళ్లాడు.

ఇంతకముందు 2019లో ఇమ్రాన్‌ తాహిర్‌ సీఎస్కే తరపున 26 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లంక స్పిన్నర్‌ వనిందు హసరంగా కూడా 26 వికెట్లతో తాహిర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.

"""/" / ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఫైనల్‌లో భాగంగా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగుల స్కోరుకే పరిమితమైంది.

131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

శుబ్‌మన్‌ గిల్‌ 45*, డేవిడ్‌ మిల్లర్‌ 32* గుజరాత్‌ను గెలిపించారు.అంతకముందు హార్దిక్‌ పాండ్యా 34 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!

రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!