చదువుల తల్లే కాదండోయ్.. చదువుల స్వామి కూడా ఉన్నాడు!
TeluguStop.com

చదువు పేరు వినగానే మన మనసులో మదిలే దేవత సరస్వతి.తెల్ల చీరతో దర్శనమిస్తుంది.


అంతే కాదు వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం.వీటన్నింటికీ అధి దేవతగా సరస్వతీ దేవిని పూజిస్తారు.


కానీ చదువుల తల్లే కాక చదువులు స్వామి కూడా ఉన్నాడు.ఆయనెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విద్యను, వివేకాన్ని ఇచ్చే దేవుడు హయగ్రీవుడు అంటుంటారు మన పెద్దలు.మానవ శరీరానికి గుర్రపు తల ఉన్న హయగ్రీవుడిని హయ శీర్షిక అని కూడా అంటుంటారు.
ఏపీలోని హిందూపురం, మచిలీపట్నాల్లో హయగ్రీవ ఆలయాలు కూడా ఉన్నాయి.వైష్ణవ సంప్రదాయంలో హయగ్రీవుడికి ప్రముఖ స్థానముంది.
ఆయనకు మొత్తం నాలుగు చేతులు ఉంటాయి.అందులో పైరెండు చేతుల్లో శంఖు చక్రాలు ఉండగా.
కుడి చేతిలో అక్షర మాల, ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది.శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు.
ఆ రోజు హయగ్రీవుడికి పూజ చేస్తే.చదువు బాగా అబ్బుతుందని ప్రజల నమ్మకం.
అంతే కాదండోయ్ ఈ కింద స్తోత్రం పఠిస్తే మరింత మంచి జరుగుతుందట.h3 Class=subheader-styleహయగ్రీవ స్తోత్రం.
/h3p
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః|| 1 ||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్|| 2 ||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః|| 3 ||
ఫలశ్రుతి : శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం|| 4 ||.