నేటి నుంచి పోలీసు ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం.
TeluguStop.com
ఖమ్మం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసు ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్(Certificate Verification ) నేటి నుంచి పదకొండు రోజులపాటు కొనసాగుతుంది.
పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్( Vishnu S Warrier Ips ) ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్
సుభాష్ చంద్ర బోస్ పక్రియ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణలో ఎస్ఐ, పోలీసు కానిస్టేబుళ్ల( Police Constables ) ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తుది రాతపరీక్షల ఫలితాలు విడుదల చేసింది.
కాగా నేటి నుంచి 26వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుంది.
తుది రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు బోర్డు సూచనల మేరకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ మార్గదర్శకాల అనుసరించి సంబంధిత పత్రాలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి వుంటుంది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రంలోనే అప్లికేషన్ ఎడిటింగ్/మాడిఫై చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా మార్కుల వెయిటేజీ పొందాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్టీఏ ధ్రువీకరించిన సర్టిఫికెట్లను చూపించాల్సి వుంటుంది, అందుకోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులు బోర్డు సూచించిన విధంగా పత్రాలతో పాటు కుల ధ్రువీకరణ పత్రం, బీసీ అభ్యర్థులు నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్ , ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్లు,బెనిఫిట్స్ రిలేటెడ్ సర్టిఫికెట్లు, తదితర ఒరిజినల్స్, జిరాక్స్‌ల సెట్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుమారస్వామి, కార్యాలయ ఏవో అక్తరూనీసాబేగం, సిఐ శ్రీనివాస్, RI తిరుపతి, సెక్షన్ సూపరిండెంట్ జానకి రామ్ ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు.
వీడియో: బెంగళూరు ఎయిర్‌పోర్ట్ చూసి ఆశ్చర్యపోయిన జపాన్ ట్రావెల్ వ్లాగర్..