ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్న సీఈఓ మీనా..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కి సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా( Mukesh Kumar Meena ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోమవారం గుంటూరు జిల్లాలో( Guntur District ) స్ట్రాంగ్ రూమ్ ల భద్రతను పరిశీలించడం జరిగింది.

నాగార్జున యూనివర్సిటీ వద్ద ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను( Strong Rooms ) ముఖేష్ కుమార్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

కౌంటింగ్ రోజు.తర్వాత ఘర్షణలు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పిస్తున్నామన్నారు.

రాష్ట్రానికి 20 కంపెనీ బలగాలను కేటాయించామని వివరించారు. """/" / స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు.

అంతేకాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అభ్యర్థులు, ఏజెంట్లు రెండుసార్లు పరిశీలించే అవకాశం కల్పించామని వివరించారు.

కౌంటింగ్ రోజు ఆ తర్వాత ఘర్షణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇదే సమయంలో పల్నాడులో పరిస్థితులు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు.ఏపీలో( AP ) ఈసారి 80 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది.

రూరల్ మరియు మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దీంతో గెలుపు విషయంలో ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన పోటీ వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి మధ్య నెలకొంది.