డెలివరీ బాయ్‌గా సీఈఓ..ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
TeluguStop.com

ఈ ప్రపంచంలో చాలా మంది గొప్పవాళ్లు అవుతారు.చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడి ఒక పెద్ద స్థాయికి చేరుకుంటారు.


అందులో కొందరికి విజయంతో పాటుగా గర్వం కూడా అలవాటు అవుతుంది.ఇంకొందరికి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అలవడుతుంది.


తాజాగా అలాంటి వారి గురించే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం.చాలా మంది ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా ఒదిగి ఉండటాన్ని అలవాటు చేసుకుంటారు.
ఊబర్ ఈట్ సీఈవో దారా ఖోస్రోషాహి కూడా అలాంటి వ్యక్తే అని చెప్పుకోవచ్చు.
తాను మొదలు పెట్టిన సంస్థలోనే తాను రెండు మాసాల పాటుగా ఫుడ్ డెలివరీ బాయ్‌గా విధులు నిర్వహించాడు.
ఇలా చేయడంతో ఆయన తమ ఉద్యోగులందరికి ఆదర్శంగా కనిపించాడు.జీవితంలో ఎంత కష్టపడి పనిచేస్తే ఎవ్వరైనా అంత విజేతలవుతారని ఆ సీఈఓ చెప్పకనే చెప్పాడు.
తనకు వచ్చిన రెండు రోజుల జీతాన్ని చూసుకొని ఆయన ఎంతో సంతోషించాడు. """/"/
ఆయన అలా జీతం తీసుకుని పనిచేయడం కొంతమందికి అయితే అస్సలు నచ్చనే లేదు.
దారా ఖోస్రోషాహి తాను పడిన కష్టాలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.తన ఫుడ్ డెలివరీ చేసిన ఆ అనుభవాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు.
ఉబెర్ ఈట్స్ కోసం తాను కొన్ని గంటలు పాటు పుడ్ డెలివరీ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.
శాన్ ఫ్రాన్సిస్కోని చూడటం తనకు చాలా ఆనందంగా ఉందని, తన రెస్టారెంట్ సిబ్బంది బాగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
అలాగే తాను ఓ రోజు డెలివరీ చేసే సమయంలో మధ్యాహ్నం 3:30 అవుతుండగా ఓ వైపు డెలివరి చేయాల్సి ఉంది.
మరోవైపు ఆయనకు చాలా ఆకలిగా ఉంది.ఏదైనా ఆర్డర్ చేసి తినాలి మరి అంటూ తన పోస్టుకు కామెంట్ ను ట్యాగ్ చేశాడు.
ట్విట్టర్ హ్యాండిల్ లో దారా ఖోస్రోషాహి తాను పని చేస్తున్న రెండవ రోజు డెలివరీ అనుభవాన్ని తెలియజేశాడు.