హైద‌రాబాద్‌లో సెంచ‌రీ కొట్టేసిన డీజిల్‌.. పండ‌గ చేసుకుందామా అంటున్న నెటిజ‌న్లు..

మ‌న దేశంలో పెట్రోల్‌, డీజిల్ రేట్లు ఎంత‌లా పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.అటు మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

అయినా స‌రే ఫర్లేదు అన్న‌ట్టుగా ప్ర‌భుత్వాల తీరు ఉంటోంది.ఎవ‌రేమైనా స‌రే అన్న‌ట్టు వ్య‌వ‌హించ‌డంతో తీవ్ర స్థాయిలో ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి.

రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి గానీ అస్స‌లు త‌గ్గ‌ట్లేదు.ఇక్క‌డ ఎవ‌రికీ అర్థం కాని విష‌యం ఏంటంటే అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు ఈ స్థాయిలో పెర‌గ‌క‌పోయినా ఇక్క‌డ మాత్రం తీవ్ర స్థాయిలో డీజిల్‌, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి.

దీంతో సామాన్య‌, మధ్యతరగతి ప్రజలు ధ‌ర‌ల భారాన్ని మోయ‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు.ఓ వైపు నిత్యవసర స‌రుకుల ధ‌ర‌లు పెరుగుతుంటే ఇంకోవైపు నిత్య‌వ‌స‌ర వ‌స్తువు లాగే ప్ర‌జ‌లు వాడుతున్న పెట్రోల్‌, డీజిల్ రేట్ల‌కు రెక్క‌లు వ‌స్తుండ‌గ‌టంతో నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది.

ఇక ఇప్పుడు హైద‌రాబాద్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు విప‌రీతంగా పెరిగిపోయాయి.మొన్న‌టి వ‌ర‌కు వంద రూపాయిలకంటే దిగువ‌న ఉన్న పెట్రోల్ ధ‌ర‌లు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి.

"""/"/ తాజాగా పెరిగిన ధ‌ర‌ల ప్ర‌క‌రాం లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.100కు చేరుకుంది.

దీంతో హైద‌రాబాద్ ప్ర‌జ‌లు మ‌రింత నిరాశ‌కు లోన‌వుతున్నారు.ఎందుకంటే హైద‌రాబాద్‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఎక్కువ‌గా ట్రాలీ ఆటోల్లాంటివి తోలుకుంటూ బ్ర‌తుకుతుంటారు.

ఇలాంటి వారికి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.ఇంకోవైపు పెట్రోల్ కూడా రూ.

110 దిశగా పరుగులు పెడుతోంది.ఇప్ప‌టికే రూ.

107.40గా సాగుతున్న పెట్రోల్ త్వ‌ర‌లోనే మ‌రింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది.

దీంతో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తు న ట్రోలింగ్ న‌డుస్తోంది.పండుగ చేసుకుందామా అంటూ మీమ్స్ పెడుతున్నారు.

ఇంకొంద‌రు సెంచ‌రీ సంద‌ర్భంగా బ్యాట్ ఎత్తి డ్యాన్స్ చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

సముద్రంలో షిప్పు శిథిలాలు.. అందులో ఏం దొరికిందో తెలిస్తే..?